లండన్ వేదికగా ఎస్. జైశంకర్ పై ఖలిస్తానీ ఉగ్రవాద శక్తుల కుట్ర... దాడికి ప్రయత్నాలు

VSK Telangana    06-Mar-2025
Total Views |
 
sjjj
 
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ను ఖలిస్థానీ అతివాదులు టార్గెట్ చేశారు. లండన్ లో ఎస్. జైశంకర్ పై దాడి చేసేందుకు ఖలిస్తానీ ఉగ్రవాద శక్తులు ప్రయత్నాలు చేశారు. ఓ ఖలిస్తానీయులు ఏకంగా జైశంకర్ కారు దగ్గరికి దూసుకొచ్చారు. లండన్ లో ఛాఠమ్ హౌస్ లో అధికారిక కార్యక్రమాలు ముగించుకొని, జైశంకర్ బయటికి వచ్చారు. సరిగ్గా ఆ సమయంలోనే కొంతమంది ఖలిస్తానీ ఉగ్రవాద శక్తులు తమ జెండాలతో నిరసన వ్యక్తం చేశారు.
 
 
 
అందులోంచి ఓ దుండగుడు ఏకంగా ఎస్. జైశంకర్ కారు వద్దకే దూసుకొచ్చాడు. కొందరు ఖలిస్తానీ అనుకూల నినాదాలు చేస్తుండగా.. మరొకడు త్రివర్ణ పతకాన్ని చించేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వున్నారు. అప్రమత్తమైన లండన్ పోలీసులు వెంటనే అతడ్ని పట్టుకున్నారు. మిగతా ఖలిస్తానీ ఉగ్రవాద శక్తులను అక్కడి నుంచి తరిమికొట్టారు.