హిందూ ఐక్యత కోసం అంబేద్కర్, డాక్టర్జీ తమ జీవితాలను ధారబోశారు : మోహన్ భాగవత్

VSK Telangana    15-Apr-2025
Total Views |
 
RSS
 
అంబేద్కర్, హెడ్గేవార్ ఇద్దరూ తమ జీవితాలను హిందూ సమాజంలో ఐక్యత, సమానత్వం తీసుకురావడానికి అంకితం చేశారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. కాన్పూర్ లోని కార్వాల్ నగరంలో సంఘ ప్రాంత కార్యాలయాన్ని మోహన్ భాగవత్ ప్రారంభించారు. అలాగే కేశవ భవన్ లో కొత్తగా నిర్మించిన అంబేద్కర్ భవనాన్ని కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత దేశాన్ని బలమైన, స్వావలంన కలిగిన, సాంస్కృతిక సుసంపన్న దేశంగా మార్చడమే లక్ష్యమని వివరించారు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనే సూత్రాలను ఫ్రెంచ్ విప్లవం నుంచి తీసుకోలేదని, భారత మట్టిలోంచి, బుద్ధుని ఆలోచనల నుంచి తీసుకున్నానని తరుచూ అనేవారని గుర్తు చేశారు.
 
స్వాతంత్రం కోసం బయల్దేరితే సమాన్వతం పోతుందని, సమానత్వం తీసుకురావడానికి బయల్దేరితే స్వాతంత్రంతో పాటు సంకోచాలు కూడా వస్తాయన్నది ప్రపంచలో వున్న అనుభవమని అన్నారు. స్వేచ్ఛ, సమానత్వం రావాలంటే సోదరభావం చాలా ప్రధానమని అన్నారు. సోదరత్వమే మతమని, భారత దేశం ధర్మమే ప్రాణంగా వున్న దేశమని, అంబేద్కర్ ఇదే అంశానికి గట్టి మద్దతుదారుగా నిలబడ్డారని మోహన్ భాగవత్ అన్నారు. సమాజంలో వున్న అసమానతలను కూకటి వేళ్లతో పెకిలించడమే అంబేద్కర్ ప్రధాన కర్తవ్యంగా వుండేదన్నారు.దీని కోసమే జీవితాంతం పనిచేశారన్నారు.

RSS2 
ఆరెస్సెస్ పనిని కూడా డాక్టర్జీ ప్రారంభించారని అన్నారు. అయితే సామాజిక అసమానతలకు బాధితులుగా లేరని కానీ... పేదరికం విషయంలో మాత్రం ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. బాల్యం నుంచే తన విద్యాభ్యాసాన్ని అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనే పూర్తి చేశారన్నారు. సమాజంలో వున్న అసమానతలను తొలగించి, సమాజంల సౌభ్రాతృత్వాన్ని నింపడానికి జీవితాన్ని అంకితం చేశారన్నారు. తన జీవితం కోసం ఆయన ఏమీ చేసుకోలేదని, జీవితాంతం హిందూ సమాజం సంఘటన, సమానత్వం కోసం డాక్టర్జీ పనిచేశారని మోహన్ భాగవత్ అన్నారు.జాతి నిర్మాణం అనే అంశంతో సంఘ కార్యం ముడిపడి వుందని, ఈ నూతన కార్యాలయం కేంద్రంగా ఈ పని మరింత సమర్థవంతంగా సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
 
అంబేద్కర్ సంఘ శాఖకు వెళ్లారని, ఈ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారని మోహన్ భాగవత్ గుర్తు చేశారు. ‘‘కొన్ని విషయాలపై మాకు విభేదాలు వుండవచ్చు. అయినప్పటికీ మేము సంఘ కార్యాన్ని మా పనిగానే చూస్తాం’’ అని అంబేద్కర్ అన్నారని పేర్కొన్నారు. ఈ వార్త అప్పట్లో కేసరి అనే పత్రికలో కూడా ప్రచురితమైందని, కేసరి వార్తా పత్రిక తిలక్ చెందిందన్నారు. అయితే.. ఆ సమయంలో తిలక్ జీవించి లేరన్నారు. ఈ ఆలోచనలతోనే సంఘ్ నిరంతరం కార్యం చేస్తుందని పేర్కొన్నారు.
 
సంఘ కార్యం అంటే కేవలం సంఘ్ పని మాత్రమే కాదని మోహన్ భాగవత్ పునరుద్ఘాటించారు. నిజానికి అది యావత్ సమాజానికి సంబంధించిన కార్యమన్నారు. మొత్తం సమాజం కూడా ఆ పని చేయాలన్నారు. తన కోసం, దేశం కోసం, కుటుంబంలోని ప్రతి వ్యక్తి పని అన్నారు. ఎప్పుడైతే సమాజం ఈ పని చేస్తుందో అప్పుడు సమాజం, పరివారం సుఖంగా వుంటుందన్నారు.
 
గత 2000 సంవత్సరాలుగా మన సమాజం ఆత్మ విస్మృతి కారణంగా స్వార్థంలో చిక్కుకుపోయామన్నారు. దీంతో సమాజంలో విభేదాలు వచ్చాయని, దీంతో అగాధం పెరుగుతూనే వుందని అభిప్రాయపడ్డారు. దీంతో కర్తవ్యం నుంచి పౌరులు విముఖులయ్యారన్నారు. వీటన్నింటినీ విదేశీ దురాక్రమణదారులు సద్వినియోగం చేసుకున్నారని,ఇక్కడి వారిని కొట్టారని, దోచుకున్నారని అన్నారు. అందుకే సమాజ కార్యం ఆగిపోయిందని, పూర్తిగా ఆగిపోయిన పనిని సమాజం తిరిగి కార్యోన్ముఖులు కావాలంటే మొదట పనిని ప్రారంభించాలని సూచించారు.
 
అయితే.. ఈ పనిని తిరిగి ప్రారంభించే వారు సమాజంలో కాస్త కొత్తవారుగా అనిపిస్తారని, ఎందుకంటే మిగిలిన వారు ఆ పనిలో వుండరన్నారు. ప్రారంభంలో అలాగే అనిపిస్తుంది కానీ... ఆ పనిని సమాజం మొత్తానిది అన్నది గుర్తుంచుకోవాలన్నారు. ఈ విధంగా మన సమాజం, సమాజంలోని ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం సంతోషంగా, సురక్షితంగా, ఆరోగ్యంగా మారాలని ఆకాంక్షించారు.
 
ఎవరి పనిని వారు నిర్వర్తించాలని, అప్పుడు మొత్తం సమాజం సంతోషంగా, సురక్షితంగా వుంటుందన్నారు. తద్వారా ప్రపంచ అవసరాలను కూడా తీర్చే సామర్థ్యం పొందుతుందని విశ్లేషించారు. అందుకే పని ప్రారంభమైందని, ఇది హిందూ సమాజాన్ని సంఘటితం చేసే పని అని అన్నారు. ఎవరైతే తమని తాము హిందువులుగా పిలుచుకుంటారో... వారినే దేశం యొక్క బాగోగుల గురించి అందరూ అడుగుతారన్నారు. జవాబుదారీతనం కూడా వారిపైనే వుంటుందని స్పష్టం చేశారు.

RSS223 
హిందువులకు ఈ దేశం మాతృదేశం కాబట్టి, పని చేయడానికి హిందూ సమాజం సదా సిద్ధంగా వుండాలని మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు. భారత్ లో మహా పురుషులు, భక్తులు, ఋషులు, రాజులు మరియు బ్రహ్మర్షుల అవిచ్ఛిన్న సంప్రదాయం ఉందని గుర్తు చేశారు. మన అదృష్టం కూడా దేశ అదృష్టంపైనే ఆధారపడి వుంటుందన్నారు. ప్రపంచంలో భారత్ ప్రతిష్ఠను పెంచుకుంటున్నా కొద్దీ... ప్రపంచ వ్యాప్తంగా హిందువుల భద్రత, ప్రతిష్ఠ కూడా పెరుగుతుందన్నారు.
 
ప్రతి పౌరుడిలోనూ సత్యం, కరుణ, పవిత్రత, తపస్సు అనే లక్షణాలను నింపడమే సంఘ పని అని సరసంఘచాలక్ వివరించారు. అందుకే కార్యాలయంలో సత్యం, కరుణ, పవిత్రత, తపస్సు అన్న లక్షణాల ప్రత్యక్ష అనుభూతిని పొందాలని సూచించారు. కార్యాలయం అనేది భావోద్వేగానికి సంబంధించిన విషయమని అన్నారు.