సనాతన ధర్మ యాప్ భారత వాహిని ఆవిష్కరణ

VSK Telangana    15-Apr-2025
Total Views |
 
Bharat Vahini
 

సనాతన ధర్మంపై రూపొందించిన “భారత వాహిణి” యాప్ ను కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి మరియు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ….ఆధునిక సమాజంలోని యువతీ యువకులకు సనాతన ధర్మంలోని ఎన్నో సూక్ష్మ విషయాలను వివరాత్మకంగా అందించటానికి ప్రారంభించిన ఈ “భారత వాహిణి మొబైల్ యాప్” హిందూ బంధువులందరికీ సనాతన ధర్మాన్ని గురించి తెలుసుకోవటానికి మార్గదర్శకంగా ఉపయోగపడుతుందని అన్నారు.

ఈ సందర్భంగా… భారతి సేవా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్. శివ సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ… సనాతన హిందూ సంప్రదాయంలో భాగమై ఈ ఆధునిక సమాజానికి తెలియని, 50 మందికి పైగా… భారతీయ ఋషి శాస్త్రవేత్తల చరిత్రలతో పాటు, భగవద్గీత 18 అధ్యాయాలు, వాల్మీకి రామాయణం – 07 కాండలు, మహా భారతం – 18 పర్వాలు మరియు అష్టాదశ పురాణాలు, హిందూ దేవీ దేవతల MP3 స్తోత్రాలు ఈ “భారత వాహిణి” మొబైల్ యాప్” లో అందుబాటులో ఉన్నట్లుగా తెలిపారు.

అలాగే, యాభైకి పైగా, యోగాసనాల వివరణ మరియు ప్రాక్టీస్ వీడియోలు, అనేక వ్యాధుల నివారణకు ఉపయోగపడే ఆయుర్వేద చిట్కాలు ఈ“భారత వాహిణి మొబైల్ యాప్” లో పొందుపరచినట్లుగా తెలియచేసారు.తెలుగు, ఇంగ్లీష్, హిందీ, కన్నడ మరియు తమిళ భాషలలో ఈ “భారత వాహిణి మొబైల్ యాప్” ను ఉపయోగించవచ్చని, ఈ భారత వాహిని మొబైల్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి ఇన్ – స్టాల్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు.