ఆలయాల దర్శనానికి యువకుడి సైకిల్‌ యాత్ర

VSK Telangana    15-Apr-2025
Total Views |

Youth on cycle
 
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల వయస్సు గల యువకుడు సాయి శివరామకృష్ణ రాష్ట్రంలోని హిందూ దేవాలయాల సంద ర్శనకు సైకిల్‌ యా త్ర చేపట్టాడు. ఈ క్రమంలో
శ్రీకాకుళం జిల్లాలోని బూరవల్లి గ్రామానికి చేరుకుని ప్రసిద్ధ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయాన్ని దర్శించి, ఆలయ చరిత్రను అర్చకులు ఆర వెల్లి సీతారామస్వామిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం శివరా మకృష్ణ మాట్లాడుతూ.. డిప్లమో చదివిన తాను రాష్ట్రంలో చారిత్రక ప్రసిద్ధి చెందిన దేవాలయాలను దర్శిస్తూ, వాటి ప్రత్యేకతలు తెలు సుకునేందుకు గత నెల 26న తన స్వగ్రామం నుంచి సైకిల్‌ యాత్ర ప్రారంభించినట్టు చెప్పారు. ఇంత వరకు కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించి ప్రసిద్ధ ఆలయాలను దర్శించుకున్నట్టు తెలిపారు. మిగిలిన జిల్లాల్లోని దేవాలయాలను దర్శించనున్నట్టు తెలిపారు.