అయోధ్య రామ మందిరంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. బాల రాముడి నుదుటిపై సూర్య తిలకం పడింది. దీనిని చూసి భక్తులు పరవశించారు. అయోధ్య ఆలయంలో గర్భ గుడిలో బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్య కిరణాలు పడేందుకు మూడో అంతస్తులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పైపులు, కుంభాకార, పుటాకార కటకాలతో ఓ వ్యవస్థను రూపొందించింది ట్రస్ట్. ఆలయ శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేందుకు ఓ పరికరాన్ని కూడా ఏర్పాటు చేశారు.
శ్రీరామనవమి తిథి రోజున సరిగ్గా మధ్యాహ్నం 12గంటల సమయంలో ఆ బాల రాముడి నుదిటిపై సూర్య తిలకం పడింది. ఈ అపూర్వ సన్నివేశం నిజంగానే అద్భుతంగా కనిపించింది భక్తులకు మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలు బాల రాముడి నుదిటిపై ప్రకాశిస్తూ.. సుమారు 4 నిమిషాల పాటు అలాగే దర్శనమిచ్చింది. ఇదంతా చూసిన భక్తులు ఆనందంతో పరవశించిపోయారు.