బీహార్‌లోని జముయి జిల్లాలో ఝూ పోలిస్ స్టేషన్ పరిధిలోని బలియాదిహ్ గ్రామానికి చెందిన సోనాలి దేవి అనే మహిళ తన భర్తతో కలిసి మే 26న జాముయ్ పోలీస్ సూపరింటెండెంట్ కు ఇచ్చిన ఫిర్యాదులో, భర్త అన్నదమ్ములు కన్హయ్య, పంచు దాస్‌లు మే 25న తనపై కర్రలు, రాడ్లతో దాడి చేసి చంపేస్తారని బెదిరించారని ఆరోపించింది. బాధితురాలు వారిద్దరూ తనను 'దయాన్' (మంత్రగత్తె) అని పిలిచారని కూడా ఆరోపించింది. బాధితురాలి ప్రకారం, ఆమె మామ తర్ణి దాస్, అత్త సురుతి దేవి , బావమరిది కన్హయ్య దాస్ సహా ఆమె అత్తమామలు క్రైస్తవ మతంలోకి మారమని నిరంతరం ఒత్తిడి తెస్తున్నారు. బాధితురాలి అత్తింటి కుటుంబ సభ్యులందరూ దాదాపు దశాబ్దం క్రితం క్రైస్తవ మతాన్ని స్వీకరించారు,
అయినప్పటికీ వారు ఇప్పటికీ బహిరంగంగా హిందువులుగా చెప్పుకుంటున్నారు. దాంతో సోనాలి దేవిని కూడా హిందువు నుండి క్రైస్తవానికి మారాలని అప్పుడే పూర్వీకుల ఆస్తిలో చెల్లుబాటు అయ్యేలా వాటా రాసిస్తామని లేకుంటే ఇవ్వమని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలిని మంత్రగత్తెగా ముద్రవేసి, ఆమె అత్తమామల కోరిక మేరకు స్థానిక 'ఓఝా' (మంత్రవిద్యతో వ్యవహరించే వారికి ఉపయోగించే పదం) ద్వారా ఆమె జుట్టును కత్తిరించి అవమానకరమైన కర్మకు గురిచేసినట్లు తెలుస్తోంది. బాధిత మహిళ రెండుసార్లు స్థానిక పోలీసులను ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోయింది.
తన అత్తమామల నిరంతర వేధింపుల కారణంగా ఆరు సంవత్సరాలుగా తన తల్లిదండ్రుల ఇంట్లో ఆశ్రయం పొందాల్సి వచ్చిందని సోనాలి ఆరోపించింది. తన అత్తమామలు తనను హిందూ ఆచారాలు చేయకుండా, హిందూ దేవతలను పూజించకుండా నిషేధించారని, అవమానించారని ఆమె ఆరోపించింది. తాను హనుమాన్ జీని పూజిస్తున్నందున ఇంట్లో దుష్టశక్తులు నృత్యం చేస్తున్నాయని, అనారోగ్యానికి కారణమవుతున్నాయని కూడా అత్తింట్లో అంటున్నారని ఆమె చెప్పింది. తన భర్త కష్టపడి సంపాదించిన డబ్బును పూర్వీకుల ఇంటి మరమ్మతు పనులలో పెట్టుబడి పెట్టాడని, అయితే ఆమె అత్తమామలు అక్కడ నివసించడానికి అనుమతించలేదని ఆమె ఆరోపించింది. మే 26న సోనాలి తాజా ఫిర్యాదు తర్వాత, ఈ విషయంపై అధికారులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ ఝబువా జిల్లాలోని బిచోలి గ్రామానికి చెందిన సంగీతా కు ఏప్రిల్ 17, 2025న ఆశిష్‌తో పూర్తి గిరిజన సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. ఎన్నో కలలతో అత్తింట్లో అడుగుపెట్టిన ఆమెకి అత్తగారు పూజగదిలోకి తీసుకెళ్లడం అక్కడ ఆమె పూజించే హిందూ దేవీదేవతలకు బదులుగా క్రైస్తవ ‘శిలువ’ ఉండటం ఆమెను షాక్‌కి గురిచేసింది. పెళ్లికి ముందు అత్తింటి వారు తాము క్రైస్తవ్యాన్ని ఆచరిస్తున్నట్లు ప్రకటించలేదు. దాంతో వివాహం తర్వాత తన సనాతన ధర్మాన్ని వదిలే ప్రసక్తే లేదని వారితో తెగేసి చెప్పి, 12 కి.మీ దూరంలోని తన సొంత ఊరు బిచోలికి కాలినడకన తిరిగి వచ్చింది. దాంతో మతం దాచి పెళ్లి చేసుకున్న కారణంగా సంగీత భర్త ఆశిష్, అతడి తండ్రి గజ్జు మచ్చర్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. వీరిద్దరిని అరెస్ట్ చేశారు. ఐదురోజులు జైలులో ఉన్న తర్వాత వీరు బెయిల్ పై విడుదలయ్యారు. చివరకు, సంగీత పోరాటం నచ్చడం, భిల్ గిరిజన పంచాయతీల తర్వాత అత్తింటి వారంతా తిరిగి తమ సొంత మతమైన ‘‘హిందూధర్మం’’లోకి మారారు. ఆశిష్ కుటుంబం గత 20 ఏళ్లుగా అనుసరిస్తున్న క్రైస్తవ మతాన్ని వదలి సనాతన ధర్మంలోకి వచ్చారు. ప్రలోభాలకు లొంగి తాము క్రైస్తవ మతంలో చేరామని, ఇప్పుడు సొంత మతాన్ని ఆచరిస్తుండటం సంతోషంగా ఉందని ఆ కుటుంబం వెల్లడించింది.
ఇలా బలవంతంగా తమ మతంలోకి మారాలంటూ కుటుంబసభ్యుల మధ్య వివాదాలతో కూడిన కేసులు చాలానే ఉన్నాయి.మన సమాజంలో చాలామంది పైకి హిందువులుగా ఉంటూనే లోపల మతం మారి క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నారు. ఇప్పుడు పైన చెప్పిన రెండు కేసులు కూడా ఇటీవల జరిగినవే అయితే ఈ రెండు కేసుల్లోనూ మహిళలు తన ధర్మాన్ని వదలబోమని...క్రైస్తవాన్ని స్వీకరించేది లేదని చూపిన ధైర్యం, తెగువ అందరికీ ఆదర్శం కావాలి. మతం దాచి వివాహం చేసుకుంటున్న వారికి సంగీతాభిల్ పోరాటం ఒక గుణపాఠం కావాలి. ఇలాంటి మోసాలను ఎదుర్కుంటున్న వారికి ఈ గిరిజన యువతి ఆదర్శం.
అలాగే మతం మారాలంటూ అత్తింటి వారు ఎన్ని చిత్రహింసలకు గురిచేసినా, తనపైన ఎన్ని నిందలు వేసినా, ఆస్తి రాసివ్వం.. అని చెప్పినా సరే స్వధర్మాన్ని వదిలే ప్రసక్తే లేదని, వారికి తగిన బుద్ది చెప్పడానికే నిశ్చయించుకున్న సోనాలి దేవి కూడా నేటితరం వారికి ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. ఇలా మతమార్పిడిల వల్ల బాధలు పడే ప్రతి ఒక్కరు ధైర్యంతో ముందడుగు తప్పకుండా న్యాయాన్ని పొందుతారు.