
తమిళనాడులోని డీఎంకే నేతృత్వంలోని ప్రభుత్వం లౌకికవాదం ముసుగులో సనాతన ధర్మాన్ని అవమానించడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది అని విమర్శించారు ఏపీ ఉపముఖ్యమంత్ర పవన్ కళ్యాణ్. మురుగన్ మహాసభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన తమిళనాడు ప్రభుత్వం ఈ మహాసభపై విమర్శలు చేయడం పట్ల అసంతఈప్తి వ్యక్తం చేశారు. సనాతన ధర్మాన్ని అందరూ గౌరవించాలనీ, భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో ఏ మతాన్ని అవమానించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.ఆయన మాట్లాడుతూ... కొంతమంది తమ సౌలభ్యం మేరకు లౌకికవాదం అనే పదాన్ని ఉపయోగిస్తున్నారని అన్నారు. లౌకికవాదం అంటే అన్ని మతాలను గౌరవించడం అని, కానీ కొంతమంది హిందూ మతాన్ని కించపరచడానికి మాత్రమే దీనిని ఉపయోగిస్తున్నారని జనసేన అధినేత ఆవేదన చెందారు. హిందూమతాన్ని, హిందూ దేవుళ్లను విమర్శిస్తూ, హేళనగా మాట్లాడమే లౌకికవాదంగాప్రకటించుకునే దుష్టశక్తులను పారదోలేందుకు హిందువులంతా సమైక్యంగా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
హిందూ దేవుళ్లను పనిగట్టుకుని విమర్శించే నాస్తికవాదులు.. అరేబియా నుంచి దేశంలోకి దిగుమతి అయిన మతాలను గానీ, ఆ మతాలకు చెందిన దేవుళ్లను గానీ విమర్శించగలరా? అని పవన్ కళ్యాణ్ నిలదీశారు. నేను ఛాందసవాదిని కాదు నిబద్ధత కల హిందువనని అన్నారు. హిందువులు ఎప్పుడు సహనం పాటిస్తారని, ఆ సహనశీలురంతా ఒక్కటైతే నాస్తికవాదులంతా పత్తాలేకుండా పోతారని హెచ్చరించారు. "నేను క్రైస్తవ మతాన్ని, ఇస్లాంను గౌరవిస్తాను, కానీ నా విశ్వాసాన్ని అవమానించను" అని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.
మధురైలో హిందూ మున్నని సంస్థ నిర్వహించిన ఈ సమావేశానికి లక్షలాది మంది భక్తులు హాజరయ్యారు. తమిళనాడు మాజీ బిజెపి అధ్యక్షుడు కె.అన్నామలై, పలువురు ఎఐఎడిఎంకె నాయకులు కూడా దీనికి హాజరయ్యారు. మురుగన్‌ను తమిళనాడుకే కాకుండా మొత్తం భారతదేశానికి దేవుడిగా పవన్ ఈసందర్భంగా అభివర్ణించారు. ఆయనను ఉత్తరాన కార్తికేయుడిగా అలాగే ఆంధ్ర-కర్ణాటకలో సుబ్రమణ్యుడిగా పూజిస్తారు. కంద షష్టి కవచం వంటి పవిత్ర శ్లోకాలను అవమానించడాన్ని కూడా ఆయన ఖండించారు. ఈ విమర్శలు ఆగకపోతే, హిందూ మతాన్ని రక్షించడానికి కఠినమైన చర్యలు తీసుకోవలసి ఉంటుందంటూ ఆయన హెచ్చరించారు.