నల్గొండకి సంబంధించిన క్రైస్తవ బిషప్ కర్ణం ధమన్ కుమార్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. జర్మనీలోని మున్‌స్టర్ నగరంలో బిషప్‌గా వున్న సమయంలో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. 2005 నుంచి 2007 మధ్య ఈ ఘటన జరిగినట్లు ఈ యేడాది మార్చి మాసంలో ఫిర్యాదులు వచ్చాయి. దీంతో బిషప్ కర్ణం ధమన్ కుమార్‌ను బాధ్యతల నుంచి తొలగించారు. దీనికి సంబంధించి మున్ స్టర్ బిషప్ ఓ ప్రకటన విడుదల చేశారు. దీనికి సంబంధించి "ది న్యూస్ మినిట్" వెబ్‌సైట్ ఓ కథనం ప్రచురించింది.
ఈ యేడాది ఏప్రిల్ మాసంలో ధమన్ కుమార్ పారిస్ వెళ్లాడు. అయితే గతంలో బిషప్‌గా అక్కడి ప్రాంతంలోనే పనిచేశాడు. తాజాగా లైంగిక వేధింపుల వ్యవహారం బయటికి రావడంతో ఆయన్ని బాధ్యతల నుంచి తొలగించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన ధమన్‌కుమార్.. 2001 నుంచి 2012 వరకు మున్‌స్టర్ నగరంలో మత గురువుగా పనిచేశారు. తర్వాత 2017లో భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో క్రైస్తవ మతబోధకుడిగా ప్రచారం చేశారు. తిరిగి 2017 నుంచి 2020 వరకు మున్‌స్టర్ నగరంలో, తర్వాత ఆ దేశంలోనే ఓల్డెన్‌బర్గ్ బార్తోలోమస్ చర్చిలో ఫాదర్‌గా పనిచేశారు. పోప్ ఫ్రాన్సిస్ 2024 ఏప్రిల్‌లో ధమన్‌కుమార్‌ను నల్లగొండ బిషప్‌గా నియమించారు.