అంగరంగ వైభవంగా అయోధ్య రామదర్బార్ ప్రాణ ప్రతిష్ఠ

VSK Telangana    05-Jun-2025
Total Views |
 
ram darbar
 
అయోధ్యలో మరో కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. అంగరంగ వైభవంగా రామ మందిర మొదటి అంతస్తులో రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు. వేద మంత్రోచ్చారణ, హవనంతో రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. అభిజిత్ స్థిరలగ్న సమయంలో రామ దర్బార్ తో సహా ఆలయ సముదాయంలోని ఏడు దేవాలయాల ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత గొప్పగా జరిగింది.అయోధ్య మరియు కాశీకి చెందిన 101 మంది ఆచార్యులు, వేద పండితులు వేద మంత్రాలతో ఈ మతపరమైన ఆచారాన్ని నిర్వహిస్తున్నారు.
 
మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుక ఈ నెల మూడో తారీఖున ప్రారంభమైంది. ఈ రోజు (ఐదో తారీఖు) తో ముగుస్తుంది. అన్ని విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు జూన్ 5తో ముగుస్తాయి. ఆ తర్వాత రామ భక్తులకు దర్శనం లభిస్తుంది. రామదర్బార్లో రామయ్య, సీత, లక్ష్ణణుడు, ఇతర దేవుళ్ల దర్శనం కోసం శ్రీరామజన్మభూమ తీర్థ్ క్షేత్ర ట్రస్టు కీలక నిర్ణయం తీసుకుంది. ముందుకుగా వచ్చేవారి కోసం 750 పాస్లను జారీ చేయాలని నిర్ణయించింది.

ram darbar2 
 
లక్నో నుంచి 62 వేల ప్రసాదాలు...
 
అయోధ్య రామ మందిర దర్బార్ ప్రాణ ప్రతిష్ఠను పురస్కరించుకొని లక్నో నుంచి 62,000 ప్రసాదాలను ప్రత్యేక పంపిచారు. చప్పన్ భోగ్ మార్కెటింగ్ హెడ్ క్షితిజ్ గుప్తా ప్రకారం, ఈ ప్రసాదంలో శనగలు మరియు పెసలుతో తయారు చేసిన ప్రత్యేకంగా బర్ఫీని తయారు చేశారు. ప్రాణ ప్రతిష్ఠ కోసం ప్రతి రోజూ 20 వేల ప్యాకెట్లను పంపుతున్నామని, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం తమకెంతో ఆనందాన్నిస్తోందని తెలిపారు.
 
ఇక.. రామ దర్బార్ విగ్రహాలను రూపొందించిన శిల్పి  కూడా తీవ్ర ఆనందానాన్ని వ్యక్తం చేస్తున్నార. ఇది పనికాదని సేవ అని అన్నారు. దీనికి తనకు ఏడు నెలలు పట్టిందని, హనుమంతుల వారకే తనకు ఈ అవకాశాన్ని ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు."శిల్పాలను చెక్కే క్రమంలో రాతిపై వేసే ప్రతి ఉలి దెబ్బలో ఎంతో భక్తి దాగి ఉంటుంది. మేము కేవలం విగ్రహాలను మాత్రమే రూపొందించడం లేదు, శ్రీరాముని కథను, ఆయన పాటించిన విలువలను ప్రపంచానికి చాటుతున్నాం" అని అన్నారు. అయోధ్యలో ఏర్పాటు కానున్న శీరామ దర్బారు రామ మందిరానికి హృదయంలాంటిదని ఆయన తెలిపారు.