శారదా బాల్ నికేతన్ విద్యార్థినికి ఆర్ఎస్ఎస్ అధినేత అభినందనలు

VSK Telangana    09-Jun-2025
Total Views |
 
Rajistan
 
ఆదర్శ్ శిక్షాన్ సంస్థాన్ నిర్వహిస్తున్న శారదా బాల్ నికేతన్ విద్యార్థిని పూజా చౌదరి తాజాగా రాజస్థాన్ బోర్డు విడుదల చేసిన ఫలితాలో 99.50 శాతం మార్కులతో రాష్ట్రంలోనే రెండవ స్థానం సాధించింది. ఈ సందర్భంగా, పాఠశాల బృందంతో పాటుగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ జీ ఆ అమ్మాయిని కలిశారు. సర్‌సంఘ్‌చాలక్ జీ ఆ బాలికకు తలపాగా చుట్టి, పుష్పగుచ్ఛాన్ని అందించి అభినందించారు. విద్యార్థి తండ్రి రామ్ ప్రతాప్ భాదు, తల్లి జన్నీ దేవిని కూడా ఆయన అభినందించారు. సర్‌సంఘ్‌చాలక్ జీ విద్యార్థిని పూజా చౌదరి భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రోత్సహించారు. 11వ తరగతిలో గణితాన్ని ఒక సబ్జెక్టుగా తీసుకొని ఐఐటీ చేయాలనుకుంటున్నానని విద్యార్థి పూజా చెప్పారు.
 
 
ఈ సందర్భంగా విద్యాభారతి రాజస్థాన్ క్షేత్ర పర్యవేక్షకులు గంగా విష్ణు బిష్రోయ్ విద్యాభారతి జోధ్‌పూర్ విభాగం గురించిన సమాచారం అందించారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ్‌ శిక్షణ సంస్థాన్‌ సంరక్షులు హనుమాన్‌సింగ్‌ దేవడా, శారదా బాల నికేతన్‌ ప్రధానాచార్యులు గెనరామ్‌ గురు, కమలా చరణ్‌, అరవింద్‌ బోడా తదితరులు పాల్గొన్నారు. సోదరి నివేదిత హాస్టల్‌లో స్వాగత, సన్మాన కార్యక్రమం జరిగింది. కాగా 2016 సంవత్సరంలో, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత ప్రతినిధి సభ సమావేశంలో, సోదరి నివేదిత హాస్టల్‌ను సర్ సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ ప్రారంభించారు.