దేవాలయ మాన్యాల ఆక్రమణ : భద్రాచలం ఈవోపై దాడి

VSK Telangana    10-Jul-2025
Total Views |
 
eo
 
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం కార్యనిర్వాహణ అధకారి (ఈవో) పై దాడి జరిగింది. దేవుడి భూముల్లో (మాన్యాలు) అక్రమ నిర్మాణాలు అడ్డుకునేందుకు వెళ్లిన ఈవో రమాదేవి వెళ్లారు. ఈ సమయంలోనే అధికారులకు, గ్రామస్థులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. దాని తర్వాత ఆలయ ఈవో రమాదేవి, సిబ్బందిపై దాడి జరిగింది. దీంతో రమాదేవి స్పృహతప్పి పడిపోయారు. ఆమెకు రక్షణగా వచ్చిన అటెండర్ పై కూడా దాడి జరిగింది. దీంతో వెంటనే ఈవో రమాదేవిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
 
పురుషోత్తపట్నంలో భద్రాద్రి రామాలయానికి 889.50 ఎకరాల భూమి ఉంది. ఈ భూములను దేవస్థానానికి అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇప్పటికే స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఈ కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ, ఆక్రమణదారులు దేవాలయ భూముల్లో అక్రమ నిర్మాణాలను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. కబ్జాకు గురవుతున్న స్వామివారి భూములను పరిరక్షించే ప్రయత్నంలో భాగంగా ఈవో రమాదేవి మంగళవారం ఘటనా స్థలానికి చేరుకున్నారు.
 
భద్రాచలం రామాలయానికి చెందిన భూముల కబ్జా వ్యవహారం గత కొద్దిరోజులుగా ఆక్రమణదారులకు, దేవాదాయ శాఖ ఉద్యోగుల మధ్య వివాదానికి దారితీస్తోంది. ఆక్రమణదారులు స్వామివారి భూముల్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టే ప్రయత్నం చేస్తుండగా.. వాటిని నిలువరించడానికి దేవాదాయ శాఖ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.