దళిత బాలిక కిడ్నాప్.. మతం మారి, జిహాదీ శిక్షణ తీసుకోవాలని ఒత్తిడి

VSK Telangana    02-Jul-2025
Total Views |

BANO 
 
యూపీకి చెందిన దళిత యువతి కిడ్నాప్ అయ్యింది. ప్రయాగరాజ్ నుంచి కేరళకు తీసుకెళ్లి, బలవంతంగా ఇస్లాంలోకి మారాలని జిహాదీ శిక్షణ కోసం ఆమెపై ఒత్తిడి తెచ్చారు. గత నెల 28 న తన కూతుర్ని కహ్కషన్ అనే మహిళ డబ్బులిచ్చి, మంచి అవకాశాలిస్తామని తీసుకెళ్లిందని గుడ్డిదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ప్రయాగరాజ్ పోలీసులు దీనిపై దృష్టి సారించారు. వ్యవస్థీకృతంగా ఇది జరుగుతుందని గ్రహించి వెంటనే కేరళ పోలీసులతో సమన్వయం చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు.
 
మార్చి 8 న ఓ వివాహానికి బాలిక వెళ్లిందని, ఆ రోజు రాత్రి 10 గంటల నుంచి కనిపించకుండా పోయిందని పోలీసులు పేర్కొంటున్నారు. స్థానికంగా వుండే బానో అనే మహిళ డబ్బులిచ్చి, ప్రలోభానికి గురి చేసి, ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి తెచ్చిందని కూడా వెల్లడించారు. అంతేకాకుండా బాలిక తన దగ్గర వుందని, వెంటనే రావాలని మహ్మద్ కైఫ్ అనే మరో వ్యక్తికి బానో సమాచారం అందించింది. దీంతో బైక్ పై మహ్మద్ ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్‌కి చేరుకుని, కత్తితో బాలికను బెదిరించినట్లు డీసీపీ వెల్లించారు.
 
ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్ నుంచి బానో, ఆ బాలిక కలిసి ఢిల్లీకి వెళ్లి, అక్కడి నుంచి త్రిస్సూర్‌కి చేరుకున్నారు. ఈ ప్రయాణంలో బానో తరుచుగా తాజ్ మహ్మద్ అనే వ్యక్తితో సంభాషణలు జరిపిందని, బాలిక తనతోనే వుందన్న విషయాన్ని కూడా వివరించింది.
 
త్రిస్సూర్ చేరుకున్న తర్వాత తనను ఓ ఇంటికి బానో తీసుకెళ్లిందని, అప్పటికే అక్కడ కొందరు యువతులు కూడా వున్నారని ఆ బాలిక వెల్లడించింది. తనను ఇస్లాంలోకి మారమని ఒత్తిడి తెచ్చారని, జిహాదీ శిక్షణ గురించి చెప్పి, తీసుకోమని ఒత్తిడి తెచ్చారని వివరించింది. దీంతో తాను భయపడి త్రిస్సూర్ రైల్వే స్టేషన్‌కి పారిపోయానని, అక్కడ పోలీసులను ఆశ్రయించి, తన కుటుంబీకులకు సమాచారం ఇచ్చినట్లు బాలిక పేర్కొంది. తర్వాత పోలీసుల సహకారం, కుటుంబీకుల సమన్వయంతో తాను తిరిగి ప్రయాగరాజ్‌కి చేరుకున్నానని వెల్లడించింది.
 
ఇక.. బానో గురించి పోలీసులు కీలక విషయాన్ని వెల్లడించారు. బానో నిత్యం జిహాదీలతో టచ్‌లో వుంటుందని, మైనర్లను ప్రలోభపెట్టడమే పనిగా పెట్టుకుందని డీసీపీ వివరించారు. అంతేకాకుండా దళిత యువతులను ఆకర్షించి, వారిని ప్రలోభపెట్టి, మతం మారేలా, జిహాదీ శిక్షణ తీసుకునేలా చేస్తుందని కూడా తెలిపారు.