జైపూర్ మహారాణి కళాశాల లోపల అక్రమంగా నిర్మించిన ముస్లిం మందిరాలు

VSK Telangana    04-Jul-2025
Total Views |
 
Muslim shrines
 
 
జైపూర్ లోని మహారాణి కళాశాల ప్రాంగణంలో మూడు మసీదులు ఏర్పడ్డాయి. దీంతో కళాశాలలో అక్రమంగా నిర్మించిన ఈ మసీదులుపై వివాదం చెలరేగింది. ఆ సంస్థ కు చెందిన భూమిని వఫ్క్ చట్టం పేరుతో ఆక్రమించేందుకు ముస్లిం వర్గాలు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు అక్కడ వెళ్లువెత్తుతున్నాయి.
 
వక్ఫ్ చట్టం సాకుతో కళాశాల ఆస్తిని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు జరిగిన 'కుట్ర'లో భాగంగానే ఆలయాలను నిర్మించారని ధరోహర్ బచావో సంరక్షణ సమితి అధినేత భరత్ శర్మ పేర్కొన్నారు. వీటిపై ఎటువంటి చర్య తీసుకోకపోతే ఆందోళన ప్రారంభిస్తామని కూడా ఆయన హెచ్చరించారు.
 
కళాశాల ప్రిన్సిపల్ పాయల్ లోధా మాట్లాడుతూ కళాశాలకాంపౌండ్ లోపల , పంప్ హౌస్ దగ్గర, వాటర్ ట్యాంక్ సమీపంలో ఇలా మూడు ప్రాంతాలలో ఎత్తైన గోడలతో ఈ అక్రమ నిర్మాణాలను నిర్మించారని పేర్కొన్నారు. అయితే వాటిని ఎవరు ఎప్పుడు నిర్మించారో తెలియటం లేదు. అధికారులు కూడా ఈ అక్రమ నిర్మాణాలను గమనించారనీ, కానీ వీటి గురించి ఇంకా ఏమీ నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇది కళాశాల భూమిని లాక్కోవడానికి జరిగిన ప్రయత్నమా అని అనుమానాన్ని వ్యక్తం చేశారు.
 
దీనిపై , కొంతమంది విద్యార్థులు స్పందిస్తూ కళాశాల క్యాంపస్ లోపల ఇలాంటి మసీదులు ఉన్నాయని తమకు తెలియదని, కానీ అక్కడ ఎటువంటి మతపరమైన కార్యకలాపాలను అనుమతించకూడదని వారన్నారు.