కశ్మీర్ ను పాక్ లో చూపించిన కాంగ్రెస్...

VSK Telangana    05-Jul-2025
Total Views |
 
congress
 
భారత భూభాగమైన కశ్మీర్ ను కేరళ కాంగ్రెస్ పాకిస్తాన్ లో చూపించింది. దీనికి సంబంధించిన చిత్ర పటాన్ని ప్రదర్శించింది. దీంతో కేరళ కాంగ్రెస్ చేసిన వ్యవహారాన్ని జాతీయవాదులు, దేశభక్తులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటలను విమర్శిస్తూ.. కాంగ్రెస్ పార్టీ భారత దేశ చిత్రపటాన్ని చూపించింది. ఇందులో కశ్మీర్ ను పాక్ లో భాగంగా చూపించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అయితే కాసేపటి తర్వాత కాంగ్రెస్ దీనిని డిలీట్ చేసేసి, సరైన పటాన్ని వుంచింది. అయితే ఇంత జరిగినా.. క్షమాపణలు గానీ, స్పందన కానీ కాంగ్రెస్ నుంచి లేదు.
 
అయితే.. బీజేపీ దీనిపై తీవ్రంగానే స్పందించింది. కాంగ్రెస్ ఉద్దేశపూర్వంగానే ఇలా చేసిందని, కాంగ్రెస్ కి ఇదో అలవాటుగా మారిపోయిందని మండిపడింది. ఈ మేరకు బీజేపీ ఐటీ సెల్ అధ్యక్షుడు అమిత్ మాలవీయ స్పందిస్తూ.. ఇందులో షాక్ కి గురిచేసింది, ఆశ్చర్యం గానీ ఏమీ లేదన్నారు.
 
కొన్ని రోజుల క్రిందట ఇదే తప్పు చేసిన తెలంగాణ కాంగ్రెస్
 
హైదరాబాద్‌లో జరిగిన ‘భారత్ సమ్మిట్ 2025’లో తప్పుగా ఉన్న భారత పటం వివాదానికి దారితీసింది. జమ్మూ కాశ్మీర్‌ను సరిగా చూపించలేదని జాతీయవాదులు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిజానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోస్ట్ చేసిన ఫోటోతో ఇది వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ దేశద్రోహానికి పాల్పడిందని విమర్శలు వస్తున్నాయి. ఇది దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే చర్య అని మండిపడుతున్నారు.
 
ఈ వ్యవహారం ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతోంది. జమ్మూ కాశ్మీర్ లో పహాల్గమ్ లో జరిగిన మారణహోమంపై దేశమంతా రగిలిపోతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ మరో వివాదంలో చిక్కుకుంది. ‘గ్లోబల్ జస్టిస్ అందించడమే ప్రధాన లక్ష్యం’ అనే ఇతివృత్తంతో హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ వేదికగా ఏప్రిల్ 25 నుంచి ఏప్రిల్ 26 వరకు “భారత్ సమ్మిట్ 2025” నిర్వహిస్తుండగా, సుమారు 100 దేశాల నుంచి 450 మంది విదేశీ ప్రతినిధులు పాల్గొంటున్న ఈ సమ్మిట్‍‌లో ఏర్పాటు చేసిన భారతదేశ చిత్ర పటం తప్పుగా ఉండటం ఇప్పుడు సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.
 
భారత సమ్మిట్‌లో పాల్గొన్న ఫొటోలను మునుగోడు ఎమ్యెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్స్ (ట్విట్టర్‌)లో పోస్ట్ చేయగా ఈ వివాదం చెలరేగింది. రాజగోపాల్ రెడ్డి ఫొటోల్లో దూరంగా ఓ ఇండియా చిత్రం కనిపిస్తుండగా, అందులో జమ్మూ కాశ్మీర్‌ను పూర్తిగా ముద్రించనట్టుగా కనిపిస్తోంది. దీంతో ఒక్కసారిగా వివాదం చెలరేగింది. బీజేపీ నేతలే కాకుండా చాలా మంది నెటిజన్లు ఈ విషయంపై తీవ్ర స్థాయిలో విమర్శలతో విరుచుకుపడ్డారు. ఈ పరిణామంతో కాసేపటికే ఆ పోస్ట్‌ని రాజగోపాల్ రెడ్డి డిలీట్ చేశారు.