అయోధ్య రామనగరి దీపోత్సవం అనేది ప్రపంచ వేదికగా తన వైభవాన్ని, ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రతి ఒక్కరూ కూడా దీపావళి సందర్భంగా జరిగే ఈ అయోధ్య దీపోత్సవాన్న తప్పకుండా చూడాలి అనేంతగా ఈ దీపోత్సవం ఉంటుంది. తాజాగా యోగీ ప్రభుత్వం ఈ భవ్య అయోధ్య నగరంలో దీపోత్సవ్ అనే పేరుతో ప్రత్యేకమైన గ్రామాన్ని నిర్మించనుంది. ఇది అయోధ్యలో మరో ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికోసం ప్రభుత్వం ఇప్పటికే భూమిని గుర్తించింది.. ఈ గ్రామం రాముడు తన వనవాస సమయంలో మొదటగా విశ్రాంతి తీసుకున్న రామచౌర గౌరఘాట్ లో ఏర్పడబోతోంది.
ఈ ప్రదేశం తరుణ్ బ్లాక్‌లోని గయాస్‌పూర్ గ్రామసభకు ఆనుకుని ప్రవహించే పౌరాణిక నది 'తంసా' ఒడ్డున ఉంది. దీపోత్సవానికి దీపాలను సరఫరా చేసే కుమ్మరులు అంతా కలిసి ఈ గ్రామంలోనే నివసించనున్నారు.. ఈగ్రామ నిర్మాణం కోసం సుమారు రెండున్నర కోట్ల రూపాయలు కేటాయించారు.
ఇది ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కలల ప్రాజెక్ట్. గత కొన్ని నెలలుగా, అధికారుల బృందం భూమి కోసం జిల్లా అంతటా పర్యటించింది, కానీ రాముడి మొదటి విశ్రాంతి స్థలం అయిన రామ్‌చౌరా గౌరఘాట్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. గ్రామం ఏర్పడిన తర్వాత కుమ్మరులంతా కలిసి దీపోత్సవానికి దీపాలను ఈ గ్రామం నుండి సరఫరా చేసే ప్రణాళిక చేశారు.అంతేకాక చారిత్రకంగానూ ఈ రాముడి గుర్తింపుకారణంగా ఇది పర్యాటకులకు ఇది ఒక సందర్శనీయ ప్రదేశం అవుతుంది. ఇక్కడికి రావడం ద్వారా కుమ్మరుల జీవనశైలిని చూడవచ్చు , అనుభూతి చెందవచ్చు. అంతేకాక దీపాలను అమ్మలా కుమ్మరులకు చిన్న చిన్న దుకాణాలను ఇస్తున్నారు. దీనివల్ల వారి వ్యాపారం కూడా పెరిగి బ్రతుకుదెరువుకు ఆసరా అవుతుందని అక్కడి కుమ్మరులు సంతోషాన్ని, ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.