దేశాన్ని బలోపేతం చేసే ఆదర్శవంతులు శాఖలో తయారవుతున్నారు : నడింపల్లి ఆయుష్

    28-Sep-2025
Total Views |
 
my home
 
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గోల్గొండ భాగ్ నార్సింగి నగర్ లోని My Home Avatar Gated Community విజయ దశమి ఉత్సవం జరిగింది. ఈ ఉత్సవానికి ముఖ్య అతిథిగా సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, విశ్రాంత ఐపీఎస్ అధికారి వీ.వీ. లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచం శక్తి ముందు తలవంచుతుందని, అయితే అది ధర్మ శక్తి అయి వుండాలన్నారు. ధర్మ శక్తి అయినప్పుడే ప్రపంచం దాని ముందు తలవంచుతుందని, అది విశ్వ సంక్షేమానికి దారి తీస్తుందన్నారు. విజయ దశమి అనేది సాత్విక శక్తి విజయానికి చిహ్నమని అన్నారు. ఈ రోజే ఆరెస్సెస్ తన ప్రయాణాన్ని ప్రారంభించిందని గుర్తు చేశారు. సమాజంలో సాత్విక బలాన్ని నిర్మించడానికి వందో సంవత్సరంలోకి అడుగుపెడుతోందన్నారు.

my home23 
ఈ ఉత్సవానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచార ప్రముఖ్ నడింపల్లి ఆయుష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1925 లో ఆరెస్సెస్ స్థాపన వెనుక డాక్టర్జీ దార్శనికతను వివరించారు. అప్పటి సమాజంలో ఆత్మ విస్మృతి,ఐక్యత లోపించడం వంటి కారణాలతో జాతీయత క్షీణించిందన్నారు.అలాగే దైనందిన శాఖ ప్రాముఖ్యాన్ని కూడా వివరించారు. కుటుంబం, సమాజంతో పాటు దేశాన్ని బలోపేతం చేసే ఆదర్శవంతమైన వ్యక్తులు శాఖా కేంద్రంగా తయారవుతారని అన్నారు. అలాగే పంచపరివర్తన్ (సామాజిక సమరసత, కుటుంబ ప్రబోధన్, పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ, పౌర నియమాలు) ద్వారా సమాజంలో పరివర్తన సాధ్యమని వివరించారు.

my home2 
ఇక.. ఇప్పుడు వస్తున్న ఆధునిక గేటెడ్ కమ్యూనిటీలలో ఆరెస్సెస్ శాఖలు కీలకమయ్యాయని, కుటుంబాలను ఏకం చేయడంలో, క్రమశిక్షణ తీసుకురావడంలో, ఐక్యత సాధించడం కోసం, సాంస్కృతిక విలువలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, తద్వారా దేశ నిర్మాణానికి దోహదపడుతున్నాయని తెలిపారు.