మధ్యప్రదేశ్ లో లవ్ జిహాద్ పై తీవ్ర చర్చ నడుస్తోంది. ఇండోర్ లో వున్న సిట్లమాతా బజార్ లో లవ్ జిహాద్ విషయంలో 50 మంది ముస్లిం ఉద్యోగులను వివిధ దుకాణాల యజమానులు తొలగించారు. ఈ నేపథ్యంలో అక్కడ చర్చ సాగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ దీనిపై విమర్శలకు దిగుతోంది. మార్కెట్ లోని రిటైల్ బట్టల దుకాణాల నుంచి ముస్లింలు ఉద్యోగాలు కోల్పోయారని, దీనంతటికీ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు, హిందూ రక్షక్ సంస్థ నేత ఏకలవ్య గౌర్ కారణమని, ఆయనే వారిని తొలగించమని హుకూం జారీ చేశారని ఆరోపించింది.
ఇక మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ బాధిత ముస్లింలను కలుసుకున్నాడు కూడా. అదే విధంగా సిట్లమాతా బజార్ ను సందర్శించాలని కూడా పట్టుబడితే, పోలీసులు అనుమతులు నిరాకరించారు. అయితే... ఇదే సమయంలో ‘‘జిహాదీ మనస్తత్వం వున్న వ్యక్తుల ప్రవేశాన్ని ఈ మార్కెట్ లోకి నిషేధిస్తున్నాం’’ అంటూ పోస్టర్లు కూడా వెలిశాయి. బ్యానర్లు కూడా పెట్టేశారు.