సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ‘‘కుమారి పూజ’’

VSK Telangana    29-Sep-2025
Total Views |
 
samithi
 అందే గ్రామం ఎస్సీ బస్తీలో సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాలలో భాగంగా 5వ రోజు శ్రీ మహాలక్ష్మి అవతారంలో కుమారి పూజ చేశారు.  అమ్మవారి మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అన్ని కులాలనుండి( మాల మాదిగ,గౌడ,ముదిరాజు, చాకలి,మొదలైన) సామాజిక సమరసత వేదిక 70 కుమారిల పాదాలు నీటితో కడిగి,తలపై చల్లుకుని,పాదాలకు పసుపు రాసి,తలపై పుష్పాలు చల్లి, పూజ చేసి కానుకలు అందించారు. గత రెండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఎస్సీలతో పాటు అన్ని వర్గాల తలిదండ్రులు తమ కూతుర్లను తీసుకుని రావటం ఆనందం కలిగించింది.
 
దేవీ నవరాత్రుల సందర్భంగా కన్యా పూజ లేదా కుమారి పూజ అనేది హిందూ ధర్మ పవిత్ర ఆచారం ఈ వేడుక దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలను సూచిస్తుంది మన సనాతన హిందూ తత్వశాస్త్రం ప్రకారం ఈ అమ్మాయిలను సృష్టియొక్క సహజ శక్తిగా పరిగణించబడుతారు వారికి గౌరవ సూచకంగా పిల్లల పాదాలను పసుపు నీళ్ళతో శుభ్రం చేయడం కానుక సమర్పించటం ఒక ఆచారం దేవి ఆరాధనలో భాగంగా కన్యా పూజ ఆడపిల్లల్లో ఉన్న స్త్రీ శక్తిని గుర్తిస్తుంది .
 

kumari2 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి డాక్టర్ ఎస్ .మౌనిక ( సన్ రైస్ హాస్పిటల్ గజ్వేల్),
ఆత్మీయ అతిథిగా శ్రీమతి ఆకుల స్వర్ణలత , శ్రీమతి వి.సావిత్రి ,ఉపాధ్యాయిని గజ్వేల్ మరియు సామాజిక సమరసత వేదిక తెలంగాణ మహిళా విభాగం కన్వీనర్ విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి రుక్మిణి  విచ్చేసి నవరాత్రుల యొక్క విశిష్టతను తెలియచేశారు. ఈ కార్యక్రమంలో అందె సామాజిక సమరసత సభ్యులు, శ్రీ శక్తి ఉత్సవ యూత్ సభ్యులు మరియు మహిళలు, యువకులు పాల్గొన్నారు.
 
కరీంనగర్ లోనూ...
సామాజిక సమరసత ఆధ్వర్యంలో కరీంనగర్ లో సంచార జాతుల వారికి కుమారీ పూజ నిర్వహించారు. ఇందులో 12 మంది మహిళలు, 11 మంది చిన్నారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామాజిక సమరసత వేదిక సభ్యులు వారి కాళ్లకు పసుపు రాసి, వారి చీరలు, కుంకుమ అందజేశారు. ఈ సందర్భంగా దేవీ నవరాత్రుల వైభవం, దేవీ తత్వం గురించి కార్యకర్తలు తెలియజేశారు. 

kumari2 
 
ఈ కార్యక్రమంలో సామాజిక సమరసత జిల్లా అద్యక్షులు రమేష్ రెడ్డి, మహిళా విభాగం జిల్లా కో కన్వీనర్ రమా దేవి, ప్రాంత సహ ప్రముఖ్ రామారావు పాల్గొన్నారు.