ముస్లింలకు దూరం.. హిందూ మహిళలతో ప్రజ్ఞా ఠాకూర్

VSK Telangana    30-Sep-2025
Total Views |
 
thakuer
 
హిందూ మహిళలు, బాలికలు ముస్లిం పురుషులకు దూరంగా వుండాలని మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ పిలుపునిచ్చారు.అలాగే ఏ ముస్లింని కూడా ఇంటిలోని మరమ్మతుల కోసం రానివ్వొద్దని కూడా సూచించారు.నవరాత్రి పండుగ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ముస్లిం ఛాందసవాదులు చేస్తున్న నీచమైన పనుల నేపథ్యంలో ఆమె ఈ పిలుపునిచ్చారు.
 
భోపాల్‌లో దుర్గా వాహిని నిర్వహించిన కార్యక్రమంలో ప్రజ్ఞా ఠాకూర్ పాల్గొన్నారు. ముస్లింలో అన్నాదమ్ముల సంబంధం వుండదని, అలాంటి వారు హిందువులను సోదరీమణులుగా ఎలా గౌరవిస్తారు? అని ప్రశ్నించారు. ముస్లింలు హిందూ మహిళలను, బాలికలను మోసం చేసి, వలలో వేసుకుంటున్న సంఘటనలు అనేకం వున్నాయన్నారు.
 
లైట్ ఫిట్టింగ్, వాటర్ ట్యాప్ రిపేర్లు లేదా డ్రైవింగ్ వంటి పనుల్లో ముస్లింలను పెట్టుకోవద్దని, ఈ చిన్న చిన్న చర్యల ద్వారా మన ఆడపిల్లలను మనం కాపాడుకున్నవారం అవుతామని వివరించారు. అంతేకాకుండా ఇప్పటికే ముస్లిం ఛాందసుల చేతిలో చిక్కుకున్న వారిని విడిపించడానికి కూడా అందరూ ప్రయత్నాలు చేయాలన్నారు.