యువకులు బాగా ఆలోచించాలి, బాగా పనిచేయాలి, ఇదే దేశభక్తి : రాం లాల్

VSK Telangana    14-Jan-2026
Total Views |
 
ram lal
 
ఆరెస్సెస్ స్థాపించి వందేళ్లు పూర్తి చేసుకుందని, ఈ సందర్భంగా దేశంలోని 15 కోట్ల కుటుంబాలను చేరుకోవడమే తమ లక్ష్యమని ఆరెస్సెస్ అఖిల భారతీయ సంపర్క ప్రముఖ్ రాంలాల్ అన్నారు. సంఘ ప్రారంభమైన సమయం నుంచే ఉపేక్షను, అపహాస్యాన్ని ఎదుర్కొందని, అయినా... భయపడకుండా పని చేస్తూనే వెళ్లిందన్నారు. ఆరెస్సెస్ ఎల్లప్పుడూ వసుధైవ కుటుంబకం అన్న సూత్రంతో పనిచేస్తోందన్నారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సాగర్ ఆధ్వర్యంలో సంఘ కార్య శతాబ్ది సందర్భంగా డాక్టర్ హరిసింగ్ గౌర్ విశ్వవిద్యాలయంలోని గోల్డెన్ జుబ్లీ ఆడిటోరియంలో ‘‘యువ సంవాద్’’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాంలాల్ హాజరయ్యారు.
 
ఈ తరం యువకులు బాగా ఆలోచించాలని, బాగా మాట్లాడాలని, బాగా పనిచేయాలని ఇదే దేశభక్తి అని ఉద్బోధించారు.యువకుల కారణంగానే భారత దేశం ప్రపంచ వ్యాప్తంగా సూటిగా తమ విధానాలను చెప్పగలిగే సామర్థ్యంతో పనిచేస్తోందన్నారు.
 
దేశంలో ఏదైనా సంక్షోభాలు, విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు ఆరెస్సెస్ స్వయంసేవకులు ముందుగా స్పందిస్తున్నారని, దీనిని చూసి యావత్ సమాజం అభినందిస్తోందన్నారు.ఈ సందర్భంగా రాంలాల్ తన సొంత అనుభవాన్ని పంచుకుంటూ.. ‘‘సూరత్‌లో ప్లేగు విపత్తు సమయంలో, ఆగ్రా మెడికల్ కాలేజీకి చెందిన స్వయంసేవకులు ప్లేగు బాధితులకు సహాయం చేయడానికి నిర్భంగా సూరత్ కు వెళ్లారు’’ అని గుర్తు చేసుకున్నారు.

ram lal2 
ఇక.. కార్యక్రమం చివర్లో యువకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇచ్చారు. ఇతర దేశాలకు వలసలు వెళ్లడంపై రాంలాల్ స్పందిస్తూ.. గ్రామాల్లో కూడా నాణ్యమైన విద్య, ఆరోగ్యం సౌకర్యాలు ఇప్పుడు బాగుపడుతున్నాయని, అలాగే సంఘ్ తో ప్రేరేపితమైన విద్యా భారతి, సేవా భారతి, NMO లాంటి సంస్థల ద్వారా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కూడా సౌకర్యాలను అందించడానికి కృషి చేస్తున్నారని తెలిపారు.
మరో ప్రశ్నకు సమాధానంగా, కుటుంబాలలో వ్యక్తివాదం పెరుగుతోందని మరియు మన గుర్తింపు భావాన్ని విస్తృతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మన గుర్తింపు హిందువుగా వుండటమేనని అన్నారు.