బంగ్లాదేశ్ లో ఇస్లామిక్ ఛాందసుల దాష్టీకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నాయి. అక్కడి ప్రభుత్వం చేతగాని తనం కారణంగా, హిందువులపై ద్వేషం కారణంగా రోజురోజుకీ రెచ్చిపోతున్నారు. తాజాగా.. సిల్హెట్ అనే ప్రాంతంలో హిందూ ఉపాధ్యాయుడి ఇంటికి ఛాందసులు ఏకంగా నిప్పంటించారు.
ఝునుసర్ అనే పాఠశాలలో బీరేంద్ర కుమార్ ఢే ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. తన ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కుటుంబీకులు భయపడి, సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు. మంటలు వేగంగా విస్తరించడంతో భయపడిపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే.. ఈ ఘటనలో ఎవ్వరికీ గాయాలు మాత్రం కాలేదు. ఘటన మాత్రం హిందువుల్లో మరోసారి భయోత్పాతం రగిలించిందని చెప్పకతప్పదు. అసలు ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అని మాత్రం తెలియడం లేదు. మరో వైపు అక్కడి యంత్రాంగం ఇంకా ఎవ్వర్ని అరెస్ట్ కూడా చేయలేదని స్థానిక హిందువులు మండిపడుతున్నారు.
ఇదేమీ జరగడం కొత్తకాదు. గత యేడాది డిసెంబర్ 28 న ఫిరోజ్ పూర్ జిల్లాలోని దుమ్రితల గ్రామంలో కూడా ఓ హిందూ ఇంటికి దుండగులు నిప్పంటించారు. దైవ దూషణ చేశారని, అభాండాలు మోపి, దారుణంగా హత్య అయిన దీపుచంద్ర దాస్ హత్య జరిగిన కాసేపటికే ఈ ఘటన జరిగింది.
అలాగే అదే నెల 23 న చిట్టగాంగ్ లోని రౌజాన్ లో హిందువులకు సంబంధించిన రెండు ఇళ్లను కూడా గుర్తు తెలియని ఛాందసులు నిప్పంటించారు. ఆ వ్యక్తులను ఇళ్లల్లోనే బంధించి, నిప్పంటించారు. దీంతో సుమారు 8 మంది ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. చిట్టగాంగ్ దాడుల నుండి బయటపడిన వారు తమ భయానక అనుభవాలను వివరించారు, తమ ఇళ్లలో పొగలు నిండిపోవడంతో తమకు అసలు విషయం తెలిసిందని, ఎటూ వెళ్లలేని పరిస్థితి దాపురించిందన్నారు. పైన వున్న రేకుల కప్పును కోసేసి, తప్పించుకున్నామని తెలిపారు.