హైదరాబాద్‌లోని చారిత్రక పురానాపూల్ దర్వాజా ఆలయం ధ్వంసం..

VSK Telangana    16-Jan-2026
Total Views |
 
old
 
హైదరాబాద్ పాతనగరంలో అత్యంత చారిత్రాత్మక హిందూదేవాలయం పురాణాపూల్ దర్వాజ మైసమ్మ ఆలయాన్ని ధ్వంసం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 1677 లో ఛత్రపతి శివాజీ మహారాజ్ శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళుతూ.. ఈ దేవాయంలో ఆగారని ఆధారాలు చెబుతున్నాయి.
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 14 వ తేదీన రాత్రి 11:30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి పురానాపూల్ దర్వాజ మైసమ్మ ఆలయంలోకి ప్రవేశించి, వరండాలో వుంచిన బ్యానర్, పీఓపీ విగ్రహాన్ని పాక్షింగా ధ్వంసం చేసినట్లు తెలిపారు. అయితే నిందితులు గర్భగుడిలోకి ప్రవేశించలేదని, గర్భగుడి లోపల ఉన్న ప్రధాన విగ్రహం పూర్తిగా సురక్షితంగా ఉందని పోలీసులు స్పష్టం చేశారు.
 
ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న కామాటిపుర పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. ఆలయ ప్రాంగణం మరియు పరిసర ప్రాంతాల నుండి సీసీటీవీ ఫుటేజ్‌లను స్వాధీనం చేసుకున్నామని, నిందితుడికి సంబంధించి కీలకమైన ఆధారాలు లభించాయని అధికారులు తెలిపారు. నిందితుడిని త్వరలో అరెస్టు చేసే అవకాశం ఉందని తెలిపారు.
 
ఈ ఘటన తర్వాత దాదాపు 300 మంది గుమిగూడారని, సమీపంలోని చిల్లాను ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు. మరో వైపు పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పుడు, పోలీసు సిబ్బందిపై దాడి జరిగింది, నలుగురు అధికారులు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. దీంతో ప్రత్యేక కేసును కూడా నమోదు చేసినట్లు పేర్కొన్నారు.సీసీటీవీ, వీడియో ఆధారాల ద్వారా నిందితులను గుర్తించామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దర్యాప్తు అధికారులు తెలిపారు.
 
ఆలయంలోని ప్రధాన మూర్తి ధ్వంసమైనట్లు సోషల్ మీడియాలో పుకార్లు అవుతోందని ,తప్పుడు వార్తలను నమ్మవద్దని పోలీసులు కోరారు. ఇందులో ఏమాత్రం నిజంలేదని, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో వుందని ప్రకటించారు.