బళ్లారిలో లవ్ జిహాద్.. మహిళ హత్య

VSK Telangana    16-Jan-2026
Total Views |
 
love jihad
కర్నాటకలోని బళ్లారిలో లవ్ జిహాద్ కేసు బయటపడింది. భయంకరమైన హత్య కేసు వెలుగులోకి రావడంతో బట్టబయలైంది. ఓ మహిళ తన భర్త నుంచి విడిపోయి, మమ్మద్ ఖ్వాజా అనే ముస్లిం వ్యక్తితో నాలుగు నెలల క్రితం వివాహం చేసుకుంది.ఆ తర్వాత అది వివాహం వరకూ వెళ్లింది. కానీ వారం రోజుల క్రితం డబ్బు, ఇతర సమస్యలపై వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఉదయం 4:30 గంటల ప్రాంతంలో టెర్రస్ పై వీరికి గొడవ జరిగినట్లు చెబుతున్నారు.ఆవేశంతో ముఖాన్ని కప్పుకొని, కత్తితో వచ్చిన ఖాజా.. ఉమా గొంతును కోశాడు. దీంతో ఉమా అక్కడికక్కడే మరణించింది.
 
నిజానికి ఉమకి పత్తికొండ గ్రామానికి చెందిన సమీప బంధువుతో వివాహం జరిగింది. ముగ్గురు సంతానం కూడా వున్నారు. అయితే విభేదాలు, గొడవలతో వారు విడిపోయారు. దీంతో ఉమ విజయనగరంలోని హోసాపేట ప్రాంతానికి వచ్చేసింది. పిల్లలను పోషించడం సవాల్ గా మారింది. దీంతో తన పెద్ద కొడుకుని తన తండ్రి వద్దే వుంచేసి, మిగతా ఇద్దరి బాధ్యతలను ఆమె తీసుకుంది.జీవనోపాధి కోసం హోసాపేట రైల్వే స్టేషన్ లోని ఓ స్టాల్ లో పనిచేయడం ప్రారంభించింది.
 
ఈ సమయంలోనే ఖాజా అనే ముస్లిం యువకుడితో ఉమకి పరిచయమైంది. కొన్ని రోజుల తర్వాత ఫోన్ నెంబర్లు ఇచ్చుకున్నారు. ప్రేమగా మారింది. రహస్యంగా వివాహం కూడా చేసుకున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఉమ కుటుంబీకులు దీనిని గమనించిన తర్వాత ఉమను నిలదీశారు. కానీ స్నేహితుడు అని సర్దిచెప్పింది.
వీరిద్దరి వివాహం జరిగిన తర్వాత కొన్ని సమస్యలు, ఆర్థిక సమస్యలు కూడా ప్రారంభమయ్యాయి. ఉమాను అనుమనించడం ప్రారంభించాడు ఖాజా. దీంతోనే ఒక రోజు ఖాజా ఆమెను చంపినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.