సమ్మక్కకు కాకతీయ రాజులకు మధ్య నిజంగానే యుద్ధం జరిగిందా?! చరిత్ర చెప్తున్న వాస్తవాలివే

    17-Jan-2026
Total Views |

sammakka saraka 
తెలంగాణలో జరిగే అతిపెద్ద గిరిజన పండుగ, తెలంగాణ రాష్ట్ర పండుగ సమ్మక్క జాతర...దీన్నే తెలంగాణ కుంభమేళ అని కూడా అంటాం..వనవాసీల దేవతలైన సమ్మక్క సారక్కలు నిరంకుశ కాకతీయులతో పోరాడి తమ ప్రాణాలను బలిచ్చారన్న పురాణ గాథ ఒకటి విస్తృతంగా ప్రచారంలో ఉంది.ఈ జాతర కారణాలను కమ్యూనిస్టులు వక్రీకరించి ఇలా అసత్య ప్రచారాన్ని చేస్తున్నారు. ప్రజలంతా దీన్నే నిజం అనుకుంటున్నారు కూడా. చరిత్రను కనుక మనం పరిశీలిస్తే 1296లో దేవగిరి యాదవ రాజు రామచంద్రుడు సుల్తాన్ ఖిల్జీ కి కప్పం కట్టడం ఆపివేసిన తర్వాత , 1308 లో, అలావుద్దీన్ తన సైన్యాధిపతి మాలిక్ కాఫుర్‌ను దేవగిరిపై దాడి చేయడానికి పంపాడు. యాదవులను ఓడించి , రామచంద్రుడిని అలావుద్దీన్ సామంతుడిగా మార్చి మాలిక్ కాఫుర్ ఢిల్లీకి తిరిగి వెళ్ళాడు.ఢిల్లీ సుల్తానేట్ దళాలు మళ్ళీ దక్కన్‌ను ఆక్రమించే అవకాశం ఉందని ప్రతాపరుద్రుడు నిశ్చయానికి వచ్చి ఓరుగల్లు కాకతీయ సామ్రాజ్యం యొక్క రక్షణ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాడు. అతను 9,00,000 మంది విలుకాళ్ళు, ఇందులో 25 వేల విలుకాళ్ళు కలిగిన దళానికి, పగిడిద్దరాజు మరికొందరు విలుకాండ్లు నాయకత్వం వహించారు, 20,000 గుర్రాలు మరియు 100 ఏనుగుల సైన్యాన్ని సమకూర్చుకున్నాడని చరిత్ర.
 
ఇలా విజయం సాధించిన తర్వాత విజయానికి కారకులైన తన సామంత రాజులు.., గ్రామీణులు శిస్తు కట్టలేదని, వారి ఊర్లను తగలబెట్టడం భారతీయ రాజులు చేసేవారా..?? స్థానిక సమ్మక్క పగిడిద్దరాజు మరియు కాకతీయ ప్రతాపరుద్రుల మధ్యన జరిగిఉంటుందా...? చక్రవర్తి తన రాజ్యంలోని ఇండ్లను, ఆలయాలను విధ్వంసం చేస్తారా.? ఆడ కూతుర్లను హత్యలు చేస్తారా..?
 
అప్పటి గ్రామాలకు పట్టణాలకు మధ్యన సంబంధాలను చెడగొట్టింది ఎవరు..? ఊర్లను తగలబెట్టింది ఎవరు..?? రెండుసార్లు ఆక్రమణకారులు ఓడిపోయినప్పటికీ , 1310లో మాలిక్ కాఫుర్ వరంగల్‌ను ఆక్రమించగలగడానికి కారణం.... ఏమిటీ..?? ఈ అంశం ఆధారంగా మనం అర్థం చేసుకోవాల్సింది. ఇది ముస్లింల దండయాత్రల సమయంలో జరిగిన పోరాటం....
 
అయితే, దీనికి సంబంధించిన నిజానిజాలు తెలుసుకోడానికి, సమగ్ర పరిశోధన అవసరమని మేడారంలోని సమ్మక్క సారక్క ఆలయ అర్చకుల బృందం, సంస్కృతి వారసత్వ పరిశోధన బృందం ‘టార్చ్‌’ అనే స్వచ్ఛంద సంస్థ భావిస్తున్నాయి. ఇవన్నిటినీ పక్కన పెడితే సమ్మక్క కాకతీయుల కాలంనాటి వీరనారి కాదనీ, క్రీస్తుపూర్వం 9030కి చెందిన శక్తి స్వరూపిణి అనే అంశం కూడా నేడు వెలుగులోకి వచ్చింది. అప్పటి తాళపత్రాల గ్రంథాలలో ఆదీవాసీల గొట్లు, గోత్రాలు, సంప్రదాయాలతో పాటు సమ్మక్క చరిత్ర, ఆమె కుటుంబ వివరాలున్నాయని కాకతీయులపై యుద్ధం అనేది కేవలం ప్రచారమే అని పరిశోధకులు చెబుతున్నారు. అఖండ భారతంలోని 18 దిక్కుల్లో 101 రాజ్యాలను సమ్మక్క ఏలిందని వారు అంటున్నారు.
 
సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ సంస్థకు చెందిన 30 మంది దాదాపు 15 సంవత్సరాలుగా సమ్మక్కసారక్క చరిత్రపై అధ్యయనం చేస్తున్నారు. ఈ అధ్యయనాల్లో వారి వంశవఈక్షం సహా అనేక విషయాలను వీరి పరిశోధనల్లో కనుగొన్నారు. వీరవనితగా మనం భావిస్తున్న సమ్మక్క వనవాసీ మూలవాసుల్లో ఒకరు, అందుకే ఆమెను శక్తి స్వరూపంగా భావిస్తున్నారని పరిశోధకులు చెబుతున్నారు. ఈ విషయంపై మరింత పరిశోధన జరగాల్సి ఉందని రీసెర్చర్లు అంటున్నారు. . కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత ప్రతాపరుద్రుని కుటుంబ సభ్యులు కొందరు గోదావరి తీరం గుండా సాహస ప్రయాణం చేసి దండకారణ్యానికి చేరుకున్నారు. కాకతీయ వారసుడైన అన్నమదేవ్‌ జగదల్‌పూర్‌ కేంద్రంగా కొత్త సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మరోవైపు శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందిన దంతేశ్వరి మాత అక్కడి కాకతీయ వంశస్థులకు ఆరాధ్య దైవం.
 
ఇదిలా వుంటే.. అసలు సమ్మక్క జస్మస్థలం బస్తర్‌ ప్రాంతమే అన్న వాదనలు కూడా వున్నాయి. కాకతీయులు కాకతీ మాతగా ఓరుగల్లులో ఉన్నప్పుడు పద్మాక్షి అమ్మవారిని పిలిచేవారు.. కొలిచే వారు... పరిశోధకుల ప్రకారం ఇప్పటివరకు కాకతాయులకు సమ్మక్క కు యుద్ధం జరిగిందనేది కేవలం కల్పితమేనని రుజువైంది. ఇప్పటికైనా వనవీరవనితలైన సమ్మక్క సారక్కలపై సమగ్ర అధ్యయనం జరిగి నిజానిజాలేంటో వెలుగులోకి రావాలని ఆశిద్దాం..'