మాఘ మేళాలో అందర్నీ ఆకట్టుకుంటున్న ’’ఆరెస్సెస్ ఛాయా చిత్ర ప్రదర్శన‘‘

VSK Telangana    23-Jan-2026
Total Views |
 
mela
 
ప్రయాగరాజ్ లోని మాఘమేళాలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 100 సంవత్సరాల ప్రయాణంపై ఓ ప్రదర్శన ను ఏర్పాటు చేశారు. భక్తులను ఇది విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ ప్రదర్శనలో సంఘ సేవా కార్యక్రమాలు, ప్రచారకుల పరంపర, స్వాతంత్ర సమరంలో సంఘ్ పాత్ర, యోగదానంతో పాటు మరికొన్ని విశేషాలను ఇందులో వుంచారు. ఈ ప్రదర్శన ద్వారా సంఘ్ ను, సంఘ్ పరంపరను అర్థం చేసుకోవచ్చు. అలాగే సంఘ్ అంటే ఏమిటో తెలుసుకోవచ్చు.
 
అయితే.. ఈ ప్రదర్శన నాలుగు గదులలో వుంచారు. మొదటి గదిలోకి ప్రవేశించగానే భారతమాత విగ్రహం వుంటుంది. అలాగే నాలుగు గదుల్లోనూ రన్నర్ పోస్టర్లను వుంచారు. మొదటి గదిలో విపత్తులు, విపత్తుల సమయంలో సంఘ్ చేసిన సేవా కార్యక్రమాలను కూడా ప్రదర్శించారు. అలాగే సంఘ్ వందేళ్ల ప్రయాణంలో వివిధ ఉద్యమాలు, డాక్టర్జీ చిత్రపటాలు, జీవిత గాథలను కూడా ప్రదర్శించారు.
 
రెండో గదిలో సంఘ్ ప్రచారకుల సంప్రదాయం, సంఘ ప్రేరేపిత సంస్థలు, దేశ విభజన సమయంలో స్వయంసేవకుల పాత్ర, శ్రీరామ జన్మభూమి ఉద్యమం, దాని వివిధ కోణాలను ప్రదర్శించారు.
 
మూడో గదిలో అఖండ భారత చిత్రపటం, స్వాతంత్ర పోరాటంలో సంఘ యోగదానం, పంచ పరివర్తన, దాని ఉద్దేశ్యాన్ని వివరించే ప్రదర్శన వుంది. అలాగే ఆరుగురు సర సంఘచాలక్ ల ఛాయా చిత్రాలను ఆకర్షణీయంగా ప్రదర్శించారు.