రాజ్యాంగాన్ని, ఐక్యతను, సరిహద్దులను కాపాడుకోవడం అందరి కర్తవ్యం : హోసబళే

VSK Telangana    27-Jan-2026
Total Views |

dattaji 
 
ఢిల్లీలో కేశవ స్మారక సమితి ఆధ్వర్యంలో ఝండేవాలాన్ లో 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గణతంత్రంలో భారతీయులుగా మనం ఎంతో గర్విస్తున్నామని అన్నారు. ఈ రోజు చాలా పవిత్రమైన రోజు అని, దేశ జాతీయ జెండాను, రాజ్యాంగ విలువలను, దేశ సనానతమైన స్వభావాన్ని రక్షించడానికి, పెంపొందించడానికి నిబద్ధత తీసుకోవాల్సిన రోజు అని అభివర్ణించారు. ఓ ప్రజాస్వామ్య దేశంగా భారత్ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని, భారత్ లో పురాతన కాలం నుంచే గణ రాజ్యాల రచన జరిగిందన్నారు. భారత్ గణతంత్ర వ్యవస్థకు ప్రపంచానికే ఓ నమూనా అని అభివర్ణించారు. మన రాజ్యాంగాన్ని, ఐక్యతను, దేశ సరిహద్దులను కాపాడుకోవడం మనందరి అత్యున్నత జాతీయ కర్తవ్యమని పిలుపునిచ్చారు.
 
త్రివర్ణ పతాకం, అశోక చక్రం గురించి వివరిస్తూ సత్యం, ధర్మం అనే విషయాలపై భారత ఆత్మ ఆధారపడి వుందన్నారు. సత్యమేవ జయతే, యతో ధర్మస్తతో జయ: అనేవి భారత పాలన, న్యాయ వ్యసవ్థ, ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలుగా అభివర్ణించారు.

dattaji2 
 
అలాగే గణతంత్ర దినోత్సవం రోజునే భీష్మాష్టమి కూడా వచ్చిందని, రెండూ జరుపుకోవడమనేది ప్రత్యేకం అని అన్నారు. ఈ సందర్భంగా భీష్మ పితామహుడి గురించి మాట్లాడుతూ.. రాజధర్మం, ప్రజాధర్మం, దేశంపట్ల భీష్ముడు ఏదైతే మార్గాన్ని చూపించారో.. అది ఇప్పటికీ మార్గదర్శనమే అని నొక్కి చెప్పారు. చరిత్ర, క్రమశిక్షణ, విధి నిర్వహణతో కూడిన జీవనమే అసలైన ప్రజా ధర్మమని, సజ్జనులను రక్షించడం, దుష్టులను శిక్షించడేమ రాజు విధి అని, అదే రాజ పాలనలో ప్రాథమిక ధర్మం అని వివరించారు.