సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

VSK Telangana    28-Jan-2026
Total Views |
 
samajka samarasatha
 
 
సికింద్రాబాద్ కనాజిగూడ అల్వాల్‌లో బోయినపల్లి జిల్లా సామాజిక సమరసత వేదిక, డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా బోయినపల్లి జిల్లా సామాజిక సమరసత వేదిక ద్వారా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారిని శాలువలతో సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను కూడా శాలువలతో సత్కరించి గౌరవించారు. ఈ కార్యక్రమంలో సామాజిక సమరసత వేదిక బోయినపల్లి జిల్లా సంయోజక్ తప్పట్ల సంపత్ కుమార్, గ్రీన్ ఫీల్డ్స్ నగర్ సామాజిక సమరసత సంయోజక్ డి నాగేశ్వరరావు, సామాజిక సమరసత వేదిక సభ్యులు ఈ కమిటీ సభ్యులను సత్కరించారు. బస్తీ ప్రముఖులు, వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ప్రెసిడెంట్: వై నిరంజన్ కుమార్, జనరల్ సెక్రటరీ: హెచ్ సంతోష్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్: బి కన్నా, అసిస్టెంట్ జనరల్ సెక్రెటరీ: పి క్రాంతి, కోశాధికారి: కట్ట నరేష్, ఆర్గనైజర్: పి ప్రభాకర్, సీనియర్ అడ్వైజర్స్ కమిటీ: ఎన్ ప్రకాష్, కే సుధాకర్, వై సదానంద్, వి వీరేష్, శ్రీకాంత్, చింటూ, రాజశేఖర్, వైస్ ప్రెసిడెంట్ వై నవీన్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.