హైదరాబాద్ తెల్లాపూర్ లో కాలనీ రోడ్డు మధ్యలో దర్గా నిర్మాణంపై అభ్యంతరం చేసినందుకు హిందువైన రమణపై ముస్లిం ఛాందసులు దాడి చేశారు. సుమారు 50 మంది ముస్లింలు రమణపై దాడికి దిగి, కొట్టి చంపడానికి ప్రయత్నించింది. తెల్లాపూర్ నైబర్ హుడ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఈశ్వరగారి రమణ వున్నారు. కాలనీకి రోడ్డు మధ్యలో దర్గాను నిర్మాణం చేయడంపై కాలనీ వాసులు, రమణ చాలా రోజులుగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే వున్నారు.
చివరికి, కాలనీలో వున్న అన్ని మతాల వారూ నైబర్ వుడ్ అసోసియేషన్ పోలీసులకు, మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కోపంతో రగిలిపోయిన ముస్లింలు... ఎలాంటి ఆధారాలు లభించకుండా సీసీ టీవీలను ధ్వంసం చేశారని ప్రతినిధులు పేర్కొన్నారు. ఇది కచ్చితంగా హత్యాయత్నం కిందికే వస్తుందని అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు.
మరో వైపు ఇంత జరుగుతున్నా.. పోలీసు విభాగం ఏమీ అనడం లేదని, పైగా బాధితులు కేసులు పెట్టవద్దని కోరారని, మతపరమైన సమస్యగా మారే అవకాశాలున్నాయని అన్నారని అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు.