
ఢిల్లీలో శబ్దోత్సవ్ 2026 వేడుకలను మూడురోజులపాటు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా చివరి రోజున, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సంఘ్ పని శైలికి ప్రాథమిక పునాది స్వయం సేవకుల ద్వారా సమాజానికి సాధికారత కల్పించడం మరియు అవగాహన కల్పించడం అని అన్నారు. అదేవిధంగా వారు మాట్లాడుతూ "సంఘ్ ప్రభుత్వాన్ని నిందించే ధోరణిని నివారిస్తుంది దానికి బదులుగా 'స్వయంసేవక్ ముందు' అనే సూత్రానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది" అని సునీల్ అంబేకర్ అన్నారు.అంతేకాకుండా "సంఘ్ సే శక్తి కలియుగ్" అంటే ఈ కలియుగంలో ఐక్యతే శక్తి అని వారు పేర్కొన్నారు., "ఏదైనా ప్రభావవంతమైన పరిష్కారం సమాజం సహకారంతో మాత్రమే సాధ్యమవుతుంది, సమాజం నుండి ఒంటరిగా ఉండటం ద్వారా కాదు" అని సునీల్ అంబేకర్ అని చెప్పారు.అందుకే సంఘ్ మొదటి అడుగు తన స్వయం సేవకులను సమస్యాత్మక ప్రాంతాలకు పంపడం మరియు వారిని పని చేయడానికి ప్రేరేపించడం అని అన్నారు. అప్పుడు, పౌరులు ఈ సమిష్టి ప్రయత్నంలో చేరమని ప్రోత్సహించబడుతారు.
అదే విధంగా ఈ కార్యక్రమంలో భాగంగా, ఆర్ఎస్ఎస్ శైలి ఆధారంగా రూపొందించిన 'సంఘర్ష్ సమాధాన్' పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా, డాక్టర్ రతన్ శారదా మరియు డాక్టర్ యశ్వంత్ పాఠక్ మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్, ఈశాన్య మరియు పంజాబ్లలో సాంస్కృతిక ఐక్యత యొక్క ఉమ్మడి పునాదిని సృష్టించడం ద్వారా సంఘ్ పనిచేస్తోందని అన్నారు. రామ జన్మభూమి ఉద్యమం ప్రారంభమైనప్పుడు, అన్ని రాజకీయ పార్టీల భాష వ్యతిరేకత మరియు అనుమానాలతో నిండిపోయిందని ఆయన అన్నారు. అయితే, ప్రజా అవగాహన పెరిగేకొద్దీ, విస్తృత ప్రజానీకం ఈ అంశాన్ని భారతదేశ గుర్తింపుతో ముడిపడి ఉందని చూశారు ఇప్పుడు ఆ వాతావరణం పూర్తిగా మారిపోయింది అని చెప్పొరు. .
ఢిల్లీలో శబ్దోత్సవ్ 2026 పేరుతో మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలోమూడు రోజుల్లో 40 కి పైగా పుస్తకాలు విడుదలయ్యాయి,... చివరి రోజైన ఆదివారం, అనేక మంది వక్తలు ఈ వేదిక నుండి వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను ప్రసంగం చేశారు. అనేకమంద విద్యార్థులు, ఆహ్వానితులు పాల్గొన్నారు.