ముస్లింలు అధికంగా వున్న మలప్పురం జిల్లాను విభజించాలన్న వేర్పాటువాద డిమాండ్ కేరళ రాజకీయ యవనికపై మళ్లీ పుట్టుకొచ్చింది. ఈ వేర్పాటువాదాన్ని తెరపైకి తెచ్చింది కాంతపురం A.P.అబూబకర్ ముస్లియార్ తెరపైకి తెచ్చారు. అబూబకర్ ఆలిండియా సున్నీ జమియ్యతుల్ ఉలేమా అనే సంస్థకు ప్రధాన కార్యదర్శి. అంతేకాకుండా ఇండియన్ గ్రాండ్ ముఫ్తీ అంటూ స్వయంగా ప్రకటించుకున్నారు. కేరళలో ప్రభావవంతమైన ముస్లిం నేతగా చెలామణి అవుతున్నారు.
అరబిక్‌లో ‘షేక్ అబూబకర్ అహ్మద్’ అని పిలువబడే ముస్లియార్ సంస్థ జనవరి 7న కేరళ యాత్ర (కేరళ మార్చ్) సందర్భంగా మలప్పురం జిల్లాలోకి ప్రవేశించినప్పుడు ఈ వేర్పాటువాద డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. ఈ ప్రకటనను కేరళ ముస్లిం జమాత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు కేరళ యాత్ర వైస్ కెప్టెన్ సయ్యద్ ఇబ్రహీంముల్ ఖలీల్ అల్ బుఖారీ తంగల్ ప్రకటించారు. అయితే ఈ డిమాండ్ ను మతపరమైన కోణంలో చూడొద్దని, ప్రజల దృష్టిలోనే చూడాలని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా రెవిన్యూను పెంచడానికి, పరిపాలనా సామర్ధ్యాన్ని మరింత పెరంచడానికే తాము ఈ డిమాండ్ ను తెచ్చామని, సమాఖ్య నిర్మాణాన్ని మాత్రం తాము ఉల్లంఘించలేదని తంగల్ చెప్పుకొచ్చారు.
జిల్లా పునర్వ్యవస్థీకరణను మతపరమైన కోణంలో చూడటం సరికాదని మరియు కేరళ అంతటా జనాభా మరియు భౌగోళిక అంశాలను జాగ్రత్తగా అంచనా వేసిన తర్వాతే పునర్వవస్థీకరణ జరగాలంటూ అన్నారు. అలాగే దీనిని మలప్పురం ప్రజల చట్టబద్ధమైన డిమాండ్ గా పరిగణించాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ప్రారంభించారు.
కాంతపురం A.P.అబూబకర్ ముస్లియార్ ఈ నెల 1 నుంచి యాత్ర ప్రారంభించారు. రాష్ట్రంలోని ముస్లింల సమస్యలపై చర్చించడానికే ఈ యాత్ర అంటూ చెప్పుకొచ్చారు. ఈ యాత్రలోనే ఈ వేర్పాటువాదాన్ని డిమాండ్ చేయడం గమనార్హం. ఈ యాత్ర కాసర్గోడ్ నుంచి తిరువనంతపురం వరకూ నిర్వహిస్తున్నారు.
ఈ డిమాండ్ కొత్తదైతే కాదు...
1. మలప్పురం విభజన డిమాండ్ కొత్తది కాదు.2025 సెప్టెంబర్‌లో, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) నాయకుడు కురిక్కోలి మొయిదీన్ MLA మలప్పురం అధిక జనాభాతో ఉన్నప్పటికీ, దాని జనాభాకు అనుగుణంగా నిధులు అందడం లేదని వాదించారు. "జిల్లాను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది" అంటూ ఆరోపణలకు దిగారు.
2. 2023 లో SDPI మలప్పురంలో ఒక ర్యాలీ నిర్వహించింది. అందులో కూడా ఈ డిమాండ్ ను తెచ్చింది. కేరళలో ముస్లింలు అధికంగా ఉన్న పరిపాలనా లేదా రాజకీయ విభాగాలను ఏర్పాటు చేయాలనే పిలుపులు సంవత్సరాలుగా పదే పదే వినిపిస్తున్నాయి.
3. జూన్ 2024లో, సున్నీ యువజన సంఘం (SYS) నాయకుడు ముస్తాఫ్ ముందుపారా ‘ప్రత్యేక మలబార్ రాష్ట్రం’ డిమాండ్ చేయడం ద్వారా వివాదాన్ని రేపారు.
4. 2023లో, IUML యువజన విభాగం అయిన యూత్ లీగ్, ఏడు జిల్లాలతో కూడిన కొత్త రాష్ట్రాన్ని డిమాండ్ తెచ్చారు. మలప్పురంలోని తిరూర్‌లో ప్రధాన కార్యాలయంతో కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేశారు.
5. అంతకుముందు, ఫిబ్రవరి 2021లో, సమస్త కేరళ జెమ్-ఇయ్యతుల్ ఉలమ్‌కు అనుబంధంగా ఉన్న సమస్త కేరళ సున్నీ స్టూడెంట్స్ ఫెడరేషన్ (SKSSF), ముస్లిం మెజారిటీ ‘మలబార్ రాష్ట్రం’ కావాలని డిమాండ్ చేసింది.
6. అదే సంవత్సరం, యువజన సంఘం త్రిసూర్ నుండి కాసరగోడ్ వరకు ఏడు జిల్లాలతో పాటు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోని మాహే మరియు తమిళనాడులోని నీలగిరిలను కలిపి కొత్త రాష్ట్రం కోసం తన డిమాండ్‌ను తెచ్చారు,. అదే సమయంలో తిరూర్‌ను జిల్లా ప్రధాన కార్యాలయంగా ఉంచాలని మరోసారి ఒత్తిడి చేసింది.