నమాజ్ చేయాలంటూ జూనియర్ ను వేధించిన సీనియర్.. పాల్ఘర్ లో ఘటన

VSK Telangana    09-Jan-2026
Total Views |
 
महाराष्ट्र: निजी मेडिकल
 
మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీ హాస్టల్ కి సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. మొఖానికి బట్ట కట్టుకొని తన సీనియర్ నమాజ్ చేయాలంటూ తనపై పదే పదే ఒత్తిడి తెస్తోందంటూ మొదటి సంవత్సరం విద్యార్థిని వెల్లడించింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తాను నిరాకరించానని, అయినా.. ఒత్తిడిని మాత్రం కొనసాగిస్తూనే వుందన్నారు. ఈ విషయం తెలుసుకున్న హిందూ సంస్థలు.. ఆందోళనకు దిగాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి, దర్యాప్తును ప్రారంభించారు. మరో వైపు కళాశాల యాజమాన్యం హాస్టల్ వార్డెన్ ని, ఉపాధ్యాయుడ్ని సస్పెండ్ చేసింది.
 
నాసిక్ కి చెందిన ఓ విద్యార్థిని ఆ కాలేజీలో ఫిజియోథెరపిలో మొదటి సంవత్సరం చదువుతోంది. తాను హాస్టల్ లో వున్న సమయంలో ముఖం కప్పుకున్న ఓ మహిళ వచ్చింది. తనను నమాజ్ చేయమని ఒత్తిడి పెంచింది. నేను నిరాకరించాను. అయినా ఒత్తిడి చేస్తూనే వుంది. భయపెట్టింది కూడా. మరుసటి రోజు నా కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చాను. యాజమాన్యం స్పందించకపోవడంతో తాము విశ్వహిందూ పరిషత్ ను సంప్రదించాం’’ అని వెల్లడించింది.
 
ఈ ఘటన క్యాంపస్ లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. హిందూ సంస్థల కార్యకర్తలు తీవ్ర నిరసనకు దిగారు.దీంతో పోలీసులు ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే.. ఇది ర్యాగింగ్ అని కూడా అన్న కోణం వచ్చింది.
 
ఇంతలో, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు కళాశాల కార్యకలాపాలపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. కళాశాలలో ఇంతకు ముందు కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని ఆ సంస్థ పేర్కొంది.అయితే, కళాశాల యాజమాన్యం ఈ ఆరోపణలను ఖండించింది మరియు గతంలో అలాంటి సంఘటన జరగలేదని తెలిపింది. కానీ.. హిందూ సంస్థలు మాత్రం దీనిని ఖండిస్తూ. గతంలోనూ జరిగాయని పేర్కొంది.