ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహతో భేటీ అయిన జపాన్ మాజీ ప్రధాని భార్య అకీ అబే

VSK Telangana    10-Oct-2026
Total Views |
 
chinaa
 
న్యూఢిల్లీ : జపాన్ దివంగత మాజీ ప్రధాని షింజో అబే సతీమణి అకీ అబే, నిప్పాన్ కైగి చైర్మన్ టొమోహికో తనిగుచి ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళేతో భేటీ అయ్యారు. ఈ భేటీ ఢిల్లీలోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం కేశవ కుంజ్ లో జరిగింది. ఈ సమావేశంలో ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ కూడా పాల్గొన్నారు.
 
భారత్-జపాన్ సంబంధాలను బలోపేతం చేయడంపై ఈ సమావేశంలో స్నేహపూర్వకమైన మరియు అర్థవంతమైన అభిప్రాయాలను పంచుకున్నారు. అలాగే నాగరికతా సంబంధాలు, సాంస్కృతిక సహకారం, ప్రజల కేంద్రంగా సాగే కార్యక్రమాలపై కూడా చర్చించారు.
 
సామాజిక సహకార ఫౌండేషన్ ఛైర్‌పర్సన్  అబే, ప్రముఖ జపనీస్ ప్రభుత్వేతర సంస్థ నిప్పన్ కైగి ఛైర్‌పర్సన్ టోమోహికో తనిగుచి, రెండు దేశాల మధ్య సంబంధాలను మరింతగా పెంపొందించుకోవాలనే ఉమ్మడి ఆసక్తిని కనబరిచారు. గంట పాటు ఈ సమావేశం సాగింది. భారత్, జపాన్‌ల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వం, ఫౌండేషన్ ఫర్ సోషల్ కాంట్రిబ్యూషన్ మరియు నిప్పన్ కైగీ ప్రతినిధి బృందం అంగీకరించాయి.భారత్, జపాన్‌ల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వం, ఫౌండేషన్ ఫర్ సోషల్ కాంట్రిబ్యూషన్ మరియు నిప్పన్ కైగీ ప్రతినిధి బృందం అంగీకరించాయి.