హిందువుల డిమాండ్ కి దెబ్బకు దిగొచ్చిన పాఠశాల.. ఏం జరిగిందంటే

VSK Telangana    13-Oct-2026
Total Views |
sinik school
 
హైదరాబాద్: చంపాపేట్‌లోని ‘‘హైదరాబాద్ సైనిక్ స్కూల్’’దుర్గామాత మాల ధరించిన విద్యార్థులు రావడంపై నిషేధం విధించింది. దసరా సెలవుల సందర్భంగా ప్రత్యేక తరగతులకు హాజరయ్యేందుకు దుర్గా మాత మాల ధరించిన పదో తరగతి విద్యార్థులు హాజరయ్యేందుకు యాజమాన్యం అనుమతి నిరాకరించింది.
 
ఈ విషయం విద్యార్థులు తమ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు.10వ తరగతి అత్యంత కీలకమైన సమయంలో ఇలా స్పెషల్ క్లాసులకు దూరం చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని, విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసే చర్య అని మండిపడ్డారు. తమకు న్యాయం జరిగే వరకూ ఆందోళన కొసాగుతుందని ప్రకటించారు.
 
దీంతో పాఠశాల యాజమాన్యం దిగొచ్చింది. విద్యార్థులను తరగతి గదికి అనుమతించని తెలుగు ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేసింది. ప్రత్యేక తరగతులకు హాజరుకాకుండా విద్యార్థులను అడ్డుకున్నారని ఆరోపిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు కూడా అందజేశారు.