పూజలు అంటూ నమ్మించి, హిందూ వ్యాపారిని హత్య చేసిన ముస్లింలు

VSK Telangana    13-Oct-2026
Total Views |
 
MURDER
 
కుటుంబంలో వున్న సమస్యలు పూజలు చేసి పరిష్కరిస్తామని నమ్మించి, వ్యాపారిని హత్య చేశారు ఇద్దరు నిందితులు. హైదరాబాద్ నగరంలోని హస్మత్ పేటకు చెందిన నేమారం చౌదరి అనే వ్యాపారి ఏడు నెలల క్రితం గుండ్లపోచంపల్లిలో ఇల్లు కట్టాడు. అందులోనే హార్డ్ వేర్ దుకాణం కూడా నడుపుతున్నాడు. ఈ సమయంలోనే సయ్యద్ ఉజ్జమాన్ తో పరిచయం ఏర్పడింది. పరిచయం ఏర్పడింది కదా అని తన వ్యక్తిగత సమస్యలు పంచుకున్నాడు వ్యాపారి.
 
ఇదే అదును అనుకొని, సయ్యద్ ఉజ్జమాన్.. తాను తన పద్ధతిలో పూజలు చేసి సమస్య పరిష్కారాలు చూపిస్తానని నమ్మించాడు. ఇందుకోసం 30 లక్షల అంగీకారం కూడా కుదిరింది. కానీ.. ఆ తర్వాత వివాదాలు నడిచినట్లు తెలుస్తోంది. ఇది కాస్త హత్య వరకూ దారి తీసింది. దీంతో పోలీసులు నిందితుల్ని రిమాండ్ కి తరలించారు.