కాసర్ గోడ్ : సేవా భారతికి సంస్థ స్వచ్ఛందంగా రక్తదానంలో చేయడంలో విశేషంగా కృషి చేస్తోంది. ‘‘జీమామృతం’’ అన్న పేరుతో గత యేడాది అక్టోబర్ నుంచి 2026 సెప్టెంబర్ మధ్య కాలంలో కాసర్ గోడ్ జనరల్ హాస్పిటల్ కి 1,044 యూనిట్ల రక్తాన్ని అందించింది.
అత్యధిక సంఖ్యలో రక్తదాతలను సమీకరించినందుకు సేవా భారతి కాసర్ గోడ్ విభగం ‘‘ప్రశంసా పత్రం’’ కూడా అందుకుంది. ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్‌కు రక్తాన్ని అందించే స్వచ్ఛంద సంస్థలలో, ఈ కార్యక్రమం అగ్రస్థానంలో నిలిచింది.
కేరళలో అత్యధిక పరిమాణంలో రక్తాన్ని (6,000 యూనిట్లకు పైగా) సేకరించినందుకు, కాసరగోడ్ జనరల్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్‌కు ఈ ఏడాది రాష్ట్రస్థాయి పురస్కారం లభించింది. ఈ మైలురాయిని చేరుకోవడంలో సేవా భారతి వంటి స్వచ్ఛంద సంస్థల సహకారం కీలక పాత్ర పోషించింది.
స్వచ్ఛంద రక్తదాతలను సమీకరించేందుకు చేసిన నిరంతర ప్రయత్నాల ద్వారా, సమాజానికి సేవ చేయడంలో మరియు ప్రాణాలను కాపాడటంలో సేవా భారతి యొక్క నిబద్ధతను జీవామృతం కార్యక్రమం పునరుద్ఘాటించింది. ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడంలోనూ, అవసరమైన రోగులకు రక్తం లభ్యతను నిర్ధారించడంలోనూ సంఘటిత స్వచ్ఛంద ప్రయత్నాల ప్రాముఖ్యతను ఈ కార్యక్రమం యొక్క కృషి నొక్కి చెబుతోంది.