న్యూఢిల్లీ : విజయ దశమి సందర్భంగా జవహర్ లాల్ నెహ్రూ (JNU) లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పథ సంచలన్ జరిగింది. భారతీయ సంస్కృతిలో విజయదశమి అనేది శక్తి, ధైర్యం, ధర్మం మరియు సత్యం యొక్క విజయానికి ప్రతీకగా నిలిచే పండుగ. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్లో విజయ దశమి ఉత్సవానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
JNU లో జరిగిన పథ సంచలన్ లో ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు గణ వేషలో, అత్యంత క్రమశిక్షణతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యక్తి నిర్మాణం ద్వారానే సమాజంలో దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం, సామాజిక బాధ్యతను పెంపొందించడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం. ఈ విజయదశమి కార్యక్రమం, అటువంటి విలువలకు కట్టుబడి ఉంటామని పునరుద్ఘాటించుకోవడానికి ఒక అవకాశంగా నిలిచింది.