సామాజిక పరివర్తనే లక్ష్యంగా సాగుతున్న సంఘ్

VSK Telangana    19-Oct-2026
Total Views |



rss

రాష్ట్రీయ స్వయంసేవక సంఘం 1925 సెప్టెంబర్ 27 విజయదశమి పండుగ రోజున నాగపూర్ లో ప్రారంభమైంది. 2026 అక్టోబర్ 20 విజయదశమి కి 101 సంవత్సరాలు పూర్తి చేసుకొని 102 వ సంవత్సరంలో అడుగు పెడుతున్నది. సంఘ పనికి కొలబద్ద శాఖ. శాఖల విస్తరణేసంఘవిస్తరణ. సంఘం అంటే సమగ్రత , సమన్వయం, సంఘటన, దాని ద్వారా దేశ సర్వాంగీణ వికాసం కోసం పనిచేయటం. . సర్వాంగీణ వికాసం కోసం వివిధ క్షేత్రాలు. ఒక ప్రక్క శాఖల వితరణ ,రెండవ ప్రక్క వివిధక్షేత్రాలు , గతివిధులు.స్వాతంత్రం రాకపూర్వం అంటే 1940 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 1000 శాఖలు ఉండేవి. స్వాతంత్రం వచ్చే తొలి రోజుల్లో దేశము మొత్తం 6000 శాఖలు ప్రారంభమైనయి. అట్లా శాఖలు క్రమంగా విస్తరిస్తూ ఈ సంవత్సరం అంటే 2026 – 27 సంవత్సరం దేశవ్యాప్తంగా సుమారు 90,000 శాఖలు నడుస్తున్నాయి ఈ శాఖలు లక్ష దాటి ఉండవచ్చు. అట్లాగే స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజులనుండే వివిధ క్షేత్రాల పనులు ప్రారంభమైనయి ,2000 సంవత్సరం నుండి గతి విధి పనులు ప్రారంభమైనయి. అట్లా సంఘంసర్వాంగీణ వికాసం కోసం రోజున దేశమంతా వేగవంతంగా విస్తరిస్తున్నది.

 

నాగరికతల సంఘర్షణలో ముందున్న భారత్

 

నాగరికతల సంఘర్షణలో ఇప్పుడు భారత్ వేగంగా ముందుకు వెళుతున్నది . ఈ విషయం ఈ మధ్యకాలంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సర్ సంఘ చాలక్ ,మోహన్ జీ భాగవత్ , సంఘ సర్ కార్య వాహ దత్తాత్రేయ హోసబలే ఇరువురు ప్రపంచంలో అనేక దేశాలకు వెళ్లి అక్కడ వివిధ రంగాలలో ప్రతిష్టలైనటువంటి అనేకమంది వ్యక్తులతో కలిసి మాట్లాడి వచ్చారు. వాళ్ళందరిముందు ‘’వసుధైవ కుటుంబకం ’’ భావన ఉంచారు. ఈ రకంగా ఈరోజు భారతదేశము ప్రపంచంలో శాంతి కోసం ప్రభావితం చేసే ప్రయత్నాలు ముందుకు తీసుకొని వెళ్లు తున్నది. దేశాల మధ్య, మతాల మధ్య, సామరస్య భావనకు , పర్యావరణ పరిరక్షణకు, ప్రపంచంలో శాంతిని స్థాపించడానికి భారతీయ ఆలోచనలే కీలకమని ఈరోజు ప్రపంచమంతా గుర్తిస్తున్నది. ఇట్లా ప్రపంచానికి భారత్ ఒక ఆధ్యాత్మిక నాయకత్వం అందించ వలసిన పరిస్థితులు ఈ రోజున నెమ్మది నెమ్మదిగా నిర్మాణం అవుతున్నాయి. ఈ సమయంలో భారతదేశంలో కూడా సైదాంతిక సంఘర్షణలు అంతిమ దశకు చేరుకోబోతున్నాయి. భారత్ కు ఈ సమయం చాలా కీలకమైంది. నిరంతర జాగృతితో వ్యవహరిస్తూ వేగంగా ముందుకు వెళ్లాలి. ఈ సమయం చాలా క్లిష్ట మైనదికూడా . ఆంగ్లంలో ఒక సామెత ఉన్నది’’ Last mile is the longest mile’’. అదే స్థితిలో ప్రపంచం, భారత్ లో నెలకొని ఉన్నది. ఒక మాట చెప్పాలంటే రెండు ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం ఈ రోజున నిలబడి ఉన్నదా అని అనిపిస్తున్నది .

 

సంఘ శతాబ్ది

 

ఈ పరిస్థితుల్లో 2025 విజయదశమి నుండి 2026 విజయదశమి వరకు సంఘ శతాబ్ది కార్యక్రమాలు దేశమంతా పెద్దఎత్తున జరిగి ముగింపుకు చేరుకున్నాయి.

సెమిటిక్ మతాల మద్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరుకునేందుకు ప్రయాస పడుతున్నది . అట్లా ప్రపంచం, బారతదేశము ఒక సంధి కాలంలో ఉంది . ఈ పరిస్థితులను అధిగమించి ముందుకు వెళ్లేందుకు సంఘం తన ప్రయత్నాలు. ప్రారంభించింది. సంఘ శతాబ్ది సమయంలో చేపట్టిన హిందూ సమ్మేళనాలు, సామాజిక సద్భావన సమావేశాలు, ప్రతిష్ఠితుల వ్యక్తుల సమావేశాలు, శాఖ సప్తాహ, కార్యక్రమాలలో పంచపరివర్తన అంటే కుటుంబ ప్రబోధన్, సామాజిక సమరసత , పర్యావరణం , స్వదేశీ , పౌర విధులు విషయాలు వాళ్ళ ముందు ఉంచారు. అవే మార్పుకు సంకేతం. అట్లాగే ఈ రోజు ప్రపంచం కూడా అనేక విషయాలపై ప్రత్యయాలను అన్వేషించే ప్రయత్నం చేస్తునది. .

 

సంఘ ప్రయాణం అంత సులభంగా సాగటంలేదు

 

సంఘ ప్రయాణం అంత సులభంగా నల్లేరు మీద బండి లాగా సాగటం లేదు. అనేక ఆటంకాలు సంఘర్షణలు అధిగమిస్తూ ముందుకు సాగుతున్నది. ఈ సమయంలో మూడు విషయాల గురించి తెలుసుకుందాం. అవి ఇప్పుడున్న దేశ సమకాలీన పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. 1) సంఘంపై రాజకీయ దాడులు2) సిద్ధాంతాల సంఘర్షణలు 3)హిందుత్వ జాగరణకు ఒక క్రమ పద్ధతిలో సాగుతున్న ప్రయత్నాలు. సంఘం పై రాజకీయ వత్తిడులు దాడులకుషుమారు 96 సంవత్సరాల చరిత్ర ఉన్నది.సంఘం 1925 లో ప్రారంభమైతే 1930 నుండి సంఘంపై రాజకీయ వత్తుడులు ప్రారంభమైనయి. సంఘాన్ని ప్రారంభించిన డాక్టర్ హెడ్గేవార్ దేశ స్వతంత్ర పోరాటంలో ఆ రోజుల్లో సాగిన అన్నిఉద్యమాలు , కార్యక్రమాలలో పాల్గొన్నారు. కలకత్తాలో వైద్య విద్య చదువుకునే రోజుల్లో విప్లవ కార్యకలాపాలు సమన్వయం చేసే అనుశీలన సమితిలో ముఖ్యమైన కార్యకర్తగా పనిచేశారు. కలకత్తా నుండి నాగపూర్ తిరిగి వచ్చిన తర్వాత స్వాతంత్ర పోరాటానికి వేదికైన కాంగ్రెస్ లో పనిచేశారు. 1906 సంవత్సరంలో ముస్లింలీగ్ ప్రారంభమై దేశ స్వతంత్ర పోరాటంపైన తన ఆదిపత్య ప్రభావాన్ని చూపిస్తూ దేశ విభజనకు రంగం సిద్ధం చేసుకుంటు వచ్చింది. ఆ ఆధిపత్యం పోరును అదుపు చేయటానికి కాంగ్రెస్ విఫలం కావడంతో ప్రత్యుమ్నాయంగా 1915 సంవత్సరంలో హిందూ మహాసభను మదన్మోహన్ మాలవీయ ప్రా రంభించారు. ప్రారంభంలో దాని పేరు సర్వదేశిక హిందూ సభ . 1921 వ సంవత్సరం ఏప్రిల్ లో అదే అఖిల భారత హిందూ మహాసభగా మారింది . 1930 నుండి ఒక రాజకీయ పార్టీ గా అవతరించింది. హిందువుల రక్షణకు ప్రారంభమైన హిందూ మహాసభలో కూడా డాక్టర్ జీ పని చేశారు . అట్లా పని చేస్తూ చేస్తూ 1925 సంవత్సరంలో రాష్ట్రీయ సంఘాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో డాక్టర్ జీ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటూ స్వతంత్ర ఉద్యమం సంఘ పని మధ్య సమన్వయం కోసం పనిచేశారు. 1935 సంవత్సరం తర్వాత కాంగ్రెస్ హిందూ మహాసభ క్రమంగా రాజకీయ పార్టీలుగా మారుతున్న సమయంలో సంఘం కాంగ్రెస్ , హిందూ మహాసభల మధ్య ఒక సంతులను కోసం తీవ్ర ప్రయత్నం చేశారు. 1937 తర్వాత రాజకీయాలతో సంబంధం లేని ఒక సామాజిక సాంస్కృతిక సంస్థగా సంఘాన్ని నిలబెట్టారు. అట్లా డాక్టర్ జి 1940 సంవత్సరం వరకు తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుని సంఘాన్ని వేగంగా ముందుకు తీసుకుపోయారు.

 

నైజాం పాలనకు వ్యతిరేకంగా హిందూ మహాసభ ఆర్యసమాజ్ 1938 అక్టోబర్ లో సత్యాగ్రహం నిర్వహించింది. ఆ సత్యాగ్రహంలో అప్పటి సంఘసర్ కార్యవాహ భయ్యాజీ దానే వంద మంది స్వయంసేవలతో ఆ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. డాక్టర్ జీ పాల్గొనలేదని సంఘమపేరుతో పాల్గొనలేదని హిందూ మహాసభ వాళ్ళు సంఘం పై విమర్శలు చేశారు వందేమాతరం పత్రికలో డాక్టర్ జీ పై అనేక వ్యాసాలు పుంఖాను పుంఖాలు గా వ్రాసారు. మద్యభారత్ లో కాంగ్రెస్ కు సంభంధించిన ప్రాంత కమిటీ డాక్టర్ జీ కి వ్రాసిన ఉత్తరంలో మా ప్రాంత కమిటీ రాష్ట్రీయ స్వయంసేవక సంఘం గురించి చర్చించబోతున్నది మీ సంఘం గురించి మాకు తెలియజేస్తూ వివరాలు అందజేయండి అని హు ఖం జారీ చేశారు. ఆ ఉత్తరాన్ని డాక్టర్ జి చెత్తబుట్లో పారేశారు. ఇట్లా డాక్టర్ జి అన్ని వైఫల నుండి ఒత్తుడులు వచ్చాయి. సంఘం ప్రారంభం కంటే ముందు ఒకసారి సంఘం ప్రారంభించిన తర్వాత 1931 జులై 14న సత్యాగ్రహం చేసి డాక్టర్ కి జైలుకు కూడా వెళ్లారు. అట్లా సంఘం పనిచేస్తూ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనటం మనం కనబడుతుంది. అట్లాగే స్వతంత్రానంతరం సంఘంపై మూడుసార్లు నిషేధానికి గురిఅయింది. గాంధీజీ హత్య సమయంలో, ఎమర్జెన్సీ సమయంలో, 1992 డిసెంబర్ 6న బాబ్రీ కట్టడం కూల్చివేత సమయంలో.ఆ నిషేధాలను నిషేధం విధించిన ప్రభుత్వాలే తమంతట తామే నిషేధాలను తొలగించవలసి వచ్చింద, అది సంఘం శక్తి .

 

దేశం ఎదుర్కొంటున్న అసలు సమస్య ఏమిటి ?

 

భారతదేశంలో దశాబ్దాలుగా జరుగుతున్న అసలైన యుద్ధం రాజ్యాధికారం ద్వారానే దేశం పునర్నిర్మాణం జరుగుతుంది అనే ఆలోచనలతో పని చేస్తున్న వారికి, దేశ పునర్ నిర్మాణం లో రాజ్యశక్తి ఉండాలి కానీ అది సర్వోపరి కాదు ధర్మము, సంస్కృతే కీలకము, అనే వారికి మధ్య జరుగుతున్నది, దేశ పునర్ నిర్మాణం అనేది దేశంలో ధర్మము సంస్కృతి ఆధారంగా సామాజిక, ఆధ్యాత్మిక శక్తిని నిర్మాణం చేయటమే కీలకము. ఈ పని చేస్తున్న ఆర్ఎస్ఎస్ ను ఈ శక్తులన్నీ మతతత్వ శక్తిగా ముస్లింలకు వ్యతిరేకమని విపరీతమైన ప్రచారం చేసుకుంటూ వచ్చారు, సంఘం పై ఇట్లా అనేక దుష్ప్రచారాలు దశాబ్దాలుగా చేసుకుంటూ వస్తూ వస్తూ ఆ శక్తులన్నీ బలహీనపడటం ఈ రోజున దేశంలో స్పష్టంగా కనపడుతున్నది, దానిని జీర్ణించుకోలేని ఉదార వాద మీడియా హిందుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నది, మతం మార్పిడులతో ప్రపంచాన్ని మార్చేయాలని కుట్రలు పన్నుతున్న మతతత్వ శక్తులుఇస్లాం , క్రైస్తవం నెంబర్ గేమ్ నడిపిస్తున్నయి ఆ ఇస్లాం, క్రైస్తవుల గురించి ఒక్కమాట మాట్లాడటం లేదు అట్లాగే ఏక వ్యక్తి నియంతృత్వంలో ఉన్న చైనా ను కూడా ఏమి అనటం లేదు. ఎందుకోసం? ప్రపంచంలోని బిబిసి లాంటి మీడియా సంస్థలు, భారత్ లో ని ఉదార వాద మీడియా హిందూ సంస్కృతిని ఎందుకు ధ్వంసం చేయాలని కంకణం కట్టుకున్నాయి? దానికి కారణాలు ఏంటి? ఎందుకంటే ప్రపంచంలో మిగిలి ఉన్న పురాతన సంస్కృతి కేవలం హిందూ సంస్కృతి మాత్రమే, అది భారతదేశంలో సజీవంగా ఉంది, మిగిలిన పురాతన సంస్కృతులు అన్నీ కూడా ఇస్లాం, క్రైస్తవం, కమ్యూనిజం ల పదఘట్టనల కింద నలిగిపోయి నామరూపాలు లేకుండా పోయాయి, ప్రపంచాన్ని తిరిగి శాంతి వైపు నడిపించగలిగే శక్తి కేవలం హిందూ ఆధ్యాత్మిక విలువలకు మాత్రమే ఉన్నదని ప్రపంచ మత మహాసభల్లో వివేకానందుడు ఇచ్చిన సందేశం ప్రపంచవ్యాప్తంగా వెళ్లిపోయింది, కాబట్టి ఆ ఆలోచనలు ప్రపంచాన్ని ప్రభావితం చేయటం తమ ఆధిపత్యానికి అడ్డం అని ఇస్లాం క్రైస్తవం కమ్యూనిజం పెట్టుబడిదారీ శక్తులు భావిస్తున్నాయి , కాబట్టి భారతదేశాన్ని బలహీనం చేయటము అంటే హిందూ సాంస్కృతిక శక్తిని బలహీనం చేయాలి , ఆ లక్ష్యంతో పనిచేస్తున్నారు. దానితో అంట కాగి వంతపాడేవాళ్లు, మన దేశంలో ఉండే లిబరల్ మేధావులు, లిబరల్ మీడియా. కాబట్టి ఇటువంటి శక్తులను కట్టడిలో ఉంచడమే ఈ రోజున హిందూ సమాజం ముందు ఉన్న ఒక పెద్ద సవాలు, ఆ సవాలను స్వీకరించి సమాజం జాగృతం కావాలి., హిందూ సంస్కృతి, ధర్మ సంరక్షణ ప్రపంచశాంతికి బాటలు వేస్తుంది అనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేయటం హిందువులుగా మన అందరి కర్తవ్యం. ఈ దిశలో ఈ రోజున దేశంలో జరుగుతున్న రాజకీయ గందరగోళాలు దుమారాలు ఈ దృష్టి కోణం నుంచి మనం ఆలోచించినప్పుడే సత్యాసత్యాలు మనకు అర్థమవుతాయి, కాబట్టి జాగృతంగా ఉండవలసిన అవసరం గతం కంటే ఇప్పుడు చాలా చాలా ఎక్కువగా ఉన్నది అనేది దేశంలో నిర్మాణం అవుతున్న పరిస్థితులు హిందువులకు అర్థం చేస్తున్నాయి ఈ విషయాలను హిందువులు జాగ్రత్తగా గమనించాలి.

 

హిందూ సమాజ జాగరణకు సంఘ చేస్తున్న ప్రయత్నాలు

 

సంఘం హిందుత్వ భావ జాగరణకు స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరనుండి అనేక కార్యక్రమాలు చేపట్టింది.1963 లో స్వామీవివేకానంద శతజయంతి , 1982-83 లో భా రతమాత గంగమాత రథయాత్రలు. 1990 సంవత్సరం జిల్లా స్థాయిలో విరాట్ హిందూ సమ్మేళనాలు.ఆ సమయం లో దేశం లో కొన్ని వేల గ్రామాలలో ప్రజలను వ్యక్తిగతంగా కలసి మాట్లాడి వచ్చింది. 2000 ల సంవత్సరంలో దేశమంతా భా రతమాత పూజ కార్యక్రమాలు, అట్లాగే షుమారు మొట్టమొదటిసారి సంఘం దేశంలోని నాలుగు లక్షల గ్రామాలకు వెళ్ళి ప్రజల ఆలోచనలు తెలుసుకొని వచ్చింది. 2006 సంవత్సరం లో సమాజానికి సంబంధించిన అన్నీ రంగాలకు సంబంధించినవారితో సమావేశాలు నిర్వహించింది. అంతేకాదు దేశంలోని అన్నికుల సంఘాల పెద్దలతో జిల్లా స్థాయి లో సమావేశాలు నిర్వహించింది. అట్లాగే దేశమంతా తాలూకా, నగర స్థాయిలో హిందూ సమ్మేళనాలు నిర్వహించింది, కొన్ని లక్షలమంది హిందువులు వాటిలో పాల్గొన్నారు. అట్లాగే సంఘ శతాబ్ది సందర్భంగా తాలూకా కేంద్రం , నగరాలలో సామాజిక సద్భావన సమావేశాలు, మండల బస్తి స్థాయిలో హిందూ సమ్మేళనాలుదేశ వ్యాప్తం గా నిర్వహించింది.లక్షలాది మంది ఆ కార్యక్రమాలలో పాల్గొన్నారు. దేశ ప్రజలకు శాఖ స్వరూపం పరిచయం చేసేందుకు శాఖా సప్తాహ కూడా నిర్వహించింది. సంఘ శతాబ్ది సమయంలో అన్నీ కార్యక్రమాలలో పంచ పరివర్తన కు సంభందించిన కుటుంబ ప్రబోధన్, సామాజిక సమారసత,పర్యావరణం , స్వదేశీ ,పౌర విధులు పనుల అవసరం అందరికీ తెలియచేసింది. అట్లాదేశ ప్రజలతోసంఘం నిరంతర సంబంధాలు పెట్టుకొంటూ సామాజిక పరివర్తనే లక్ష్యంగా వేగంగా ముందుకు వెళ్లుతున్నది. 

 
 ( విజయదశమి సందర్భంగా ప్రత్యేక వ్యాసం )

రాంపల్లి మల్లికార్జునరావు