హైదరాబాద్ నగరం నానాటికీ మత విద్వేషాలకు నిలయంగా మారుతోంది. మరీ ముఖ్యంగా హిందూ దేవాలయాలను ముస్లింలు లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా నగరంలోని దిల్సుఖ్నగర్ బస్ డిపో సమీపంలో ఉన్న సంతోషి మాత ఆలయంపై గాంధీ జయంతి రోజున మహమ్మద్ అన్సారీ అనే వ్యక్తి కర్రలతో దాడి చేశాడు. కర్రతో అక్కడి పూజారిపైన, అలాగే అమ్మవారి విగ్రహంపైన దాడికి దిగాడు. వెంటనే ఆలయంలో ఉన్న భక్తులు అప్రమత్తమై అతన్ని పట్టుకుని చైతన్యపురి పోలీసులకు అప్పగించారు. బహుశా ఇతనిపై కూడా పిచ్చివాడనే ముద్ర వేసి వదిలేస్తారేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుడి పక్కనే వుండి, పక్కా స్కెచ్ తోనే అన్సారీ దాడికి దిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఉదయం దాదాపు 10:05 గంటల ప్రాంతంలో మహమ్మద్ అన్సారీ అనే వ్యక్తి ప్రవేశించి హల్చల్ చేశాడు. ఆలయంలోకి చొరబడిన తన చేతిలో ఉన్న కర్రతో పూజారిపై దాడికి యత్నించినట్లు కూడా ఆరోపణలు వున్నాయి. అంతటితో ఆగకుండా ఏకంగా అమ్మవారి విగ్రహాన్ని కర్రతో కొడుతూ ధ్వంసం చేసే ప్రయత్నం చేశాడు.
దాడి చేసిన సమయంలో అర్చకుడు, భక్తులు కూడా వున్నారు. దాడి చేయగానే నిందితుడు అన్సారీని పట్టుకొని, డయల్ 100 కి ఫోన్ చేసి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు దేవాలయం దగ్గరికి చేరుకొని, నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. దీని తర్వాత సంతోషిమాత ఆలయ ట్రస్టీ అన్సారీపై ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేశారు.
మరో వైపు హిందూ దేవాలయాలపై తరుచుగా దాడులు జరుగుతున్నాయని, అయినా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, నిందితులకు కఠినమైన శిక్షలు కూడా వేయడం లేదని హిందువులు మండిపడుతున్నారు. నిందితుడికి కఠిన కారాగార శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్నా.. ప్రభుత్వం మిన్నకుండి పోతోందన్నారు.
గతంలో ముత్యాలమ్మ గుడిపై దాడి చేసిన ముస్లిం యువకుడిని ఇలాగే వదిలేశారు. ఒక రాష్ట్ర రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరంలో హిందూ దేవాలయాలపై ఈ దాడులు కొత్త కాదు. హిందువుల విశ్వాసాలపై ఎన్ని దాడులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వాలు తూతూ మంత్రంగా కంటితుడుపు చర్యలు తీసుకుంటూ కాలం గడిపేస్తున్నాయి. మేలుకోవలసింది హిందువులే..