మచ్చర్ పోరాటం నేపథ్యంలో అందరికీ గుర్తొచ్చిన నీర్జా భనోట్

VSK Telangana    02-Oct-2026
Total Views |

nb
 
మృత్యువు తన వైపు దూసుకొచ్చినా, ఎదురొడ్డి పోరాడి, ప్రయాణికులను కాపాడారు కెప్టెన్ స్మిత్ మచ్చర్. ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన పోరాటంలో ఆయన గాయపడినా.. ఎంతో మంది ప్రాణలను కాపాడారు. ఈ ధైర్యాన్ని చూసి ప్రపంచ దేశాధినేతలందరూ తెగ ప్రశంసలు కురిపించారు. అయితే.. సరిగ్గా నాలుగు దశాబ్దాల క్రితం మరో భారతీయురాలికి విమానంలో అచ్చు ఇలాంటి ప్రాణాపాయ స్థితే ఎదురైంది.
 
నీర్జా భనోట్ అనే ఫ్లైట్ అటెండెంట్ . ఆమె అమెరికాకి చెందిన ‘‘పామ్ ఆమ్ ఎయిర్ లైన్స్’’ లో పని చేసేవారు. 1986 సెప్టెంబర్ 5 న ఈ సంస్థకు చెందిన ఓ విమానం ముంబై నుంచి న్యూయార్క్ బయల్దేరింది. మధ్యలో పాక్ లోని కరాచీ విమానాశ్రయంలో ఆగింది. కాసేపటికే విమానం టేకాఫ్ అవుతుందనగా ఒక్కసారిగా కాల్పులు జరిగాయి. దీంతో ప్రయాణికులు తీవ్రంగా భయపడ్డారు. ఎయిర్ పోర్టు సిబ్బంది దుస్తుల్లోనే నలుగురు ఇస్లామిక్ ఉగ్రవాదులు.. తొపాకులతో వచ్చి, విమానాన్ని హైజాక్ చేస్తున్నట్లు ప్రకటించారు.
 
ఈ సమయంలోనే నీర్జా పూర్తిగా సమయ స్ఫూర్తి, ధైర్య సాహసాలను ప్రదర్శించారు. వెంటనే కాక్ పిట్ సిబ్బందిని అలర్ట్ చేశారు. దీంతో ఉగ్రవాదులు విమానాన్ని తమ నియంత్రణలోకి తీసుకోకుండా పైలట్లు నిలువరించారు. ఆ తర్వాత విమానంలోకి అమెరికా ప్రయాణికుల కోసం హైజాకర్ల ప్రయత్నించారు. వారిని బంధించి అమెరికాతో తమ డిమాండ్లను నెరవేర్చుకోవాలన్నది వారి ప్లాన్. అందరి పాస్ పోర్టులు తేవాలని బెదిరించారు. కానీ.. నీర్జా వారికి ఆ వివరాలు మాత్రం అందించలేదు. అమెరికా ప్రయాణికుల పాస్ పోర్టులు దాచి పెట్టారు.
 
ఆ తర్వాత అధికారులు సంప్రదింపులు జరిపినా.. లాభం లేదు. అందునా ఇంధనం నిండుకొని లైట్లు కూడా ఆగిపోయాయి. సరిగ్గా ఇదే సమయంలో నీర్జా ప్రయాణికులను కాపాడేందుకు ధైర్యంతో నెమ్మదిగా మూడు ఎగ్జిట్ డోర్లను తెరిచి, ఒక్కక్కరిని పంపించారు. దీంతో ఉగ్రవాదులు కాల్పులకు కూడా దిగారు. కొంత మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. అయినా నీర్జా భయపడలేదు. ముగ్గురు పిల్లలను తూటాల నుంచి కాపాడేందుకు నిల్చున్నారు. ఆ చిన్నారులను బయటికి పంపిస్తుండగా.. ఉగ్రవాదుల కాల్పులకు బలయ్యారు. కాల్పుల్లో 20 మంది మరణించగా, మరో 100 మంది గాయపడ్డారు.
 
అయితే నీర్జా స్వస్థలం ఛండీగఢ్. తండ్రి విలేకరి. మొదట్లో మోడలింగ్ చేయాలని బాగా ఆసక్తి చూపించేది నీరజ. కానీ.. తర్వాత విమాన రంగంలోకి అడుగుపెట్టారు. ఈ ఘటన జరిగినప్పుడు నీర్జా వయస్సు కేవలం 22 సంవత్సరాలే. నీర్జా ధైర్యసాహసాలను గుర్తించి, భారత ప్రభుత్వం అశోక చక్ర కూడా ప్రదానం చేసింది. ఆ తర్వాత ఆమె జీవితం ఆధారంగా 2016 లో సినిమా కూడా వచ్చింది.