రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అక్టోబర్ 20, 2026 న నాగ్‌పూర్‌లో విజయదశమి ఉత్సవాన్ని నిర్వహించింది, ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు అంశాలను ప్రాస్తావిస్తూ.. సామాజిక ఉద్యమాలు ,విభజన, రాజకీయ ప్రేరేపిత శక్తుల విషయాన్ని ప్రస్తావించారు.
విచ్ఛిన్నకర, రాజకీయ ప్రేరేపిత శక్తులు సామాజిక ఉద్యమాలను తప్పుదోవపట్టించడంపై కూడా డాక్టర్ మోహన్ భాగవత్ మాట్లాడారు. “ఈ ప్రయత్నాల వెనుక, సమాజానికి, దేశానికి మార్గనిర్దేశం చేసే బాధ్యత మనకూ ఉంది, ఎందుకంటే ఈ దేశం, సమాజం మనవే అనే స్ఫూర్తి ఉంది. సామాజిక ఉద్యమాలకు కూడా అదే స్ఫూర్తి మార్గదర్శకం కావాలి. అయితే, ఇది అలా కాకుండా ఒక ఉద్యమం రాజకీయాలకు సాధనంగా మారినప్పుడు, ఒక వ్యక్తి, ఒక సమూహం లేదా ఒక సిద్ధాంతంపై శత్రుత్వం మరియు వ్యతిరేకతతో నడిపించబడినప్పుడు, భారత్‌ను బలహీనపరచాలని కోరుకునే శక్తులు ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుంటాయి. అభిప్రాయ భేదాలను మరింత పెంచడం, వాటిని పరస్పర శత్రుత్వంగా మార్చడం, వివిధ సమస్యల సందర్భంలో బాధితులనే భావాలను రేకెత్తించడం, తద్వారా దేశ వ్యవస్థలపై నమ్మకం లేకుండా చేయడం మరియు దేశంలో అసమ్మతి, తీవ్ర అసంతృప్తి, వేర్పాటువాదం, అశాంతి, అరాచక వాతావరణాన్ని సృష్టించడం వారి పనితీరు. భారతదేశాన్ని అణచి వేయాలని కోరుకునే ప్రపంచ శక్తులు కూడా అప్పుడప్పుడు ఈ ప్రక్రియలో తమ పాత్రను పోషిస్తాయన్నారు.
పరస్పర సద్భావాన్ని కాపాడుకోవాల్సిన మరియు భారత్ జాతీయ ఆకాంక్షలపై దృష్టి పెట్టాల్సిన అవటరాన్ని నొక్కిచెబుతూ, , “ఇలాంటి విభజన ధోరణుల ద్వారా సృష్టించబడిన మేధోపరమైన గందరగోళం నుండి మనల్ని మనం రక్షించుకుంటూ, అప్రమత్తంగా ఉండటం ద్వారా మన పరస్పర సద్భావాన్ని మనం రక్షించుకోవాలని సూచించారు. మనం అప్రమత్తంగా ఉండాలి, ఏ విధంగానూ కలవరపడకూడదు లేదా రెచ్చిపోకూడదని సూచిస్తూ.. భారత్ విశ్వగురు హోదాను సాధించాలనే మన ఆకాంక్ష మరియు లక్ష్యం ఎల్లప్పుడూ మన మనస్సులలో గట్టిగా ఉంటూ, మన ప్రయత్నాలలో కృషి చేస్తూనే ఉండాలని సూచించారు.
పరస్పర సద్భావనను కాపాడుకోవడంతో పాటు, భారత జాతీయ ఆకాంక్షలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతూ, డాక్టర్ భగవత్ ఇలా అన్నారు, “ఇటువంటి విభజన ధోరణుల వల్ల ఏర్పడే మేధోపరమైన గందరగోళం పట్ల అప్రమత్తంగా ఉంటూ, మనల్ని మనం కాపాడుకోవడం ద్వారా మన పరస్పర సద్భావనను పరిరక్షించుకోవాలనేది స్పష్టంగా అర్థమవుతోందన్నారు. మనమంతా అప్రమత్తంగా వుండాలని, ఎలాంటి పరిస్థితుల్లోనూ విచలనం కాకుండా వుండాలని, రెచ్చగొట్టే వాళ్ల విషయంలో పావులుగా మారకూడదని హెచ్చరించారు. భారత్ విశ్వగురువు కావాలన్న లక్ష్యాన్ని మనం నిరంతరం మన మనస్సులో వుంచి, మన ప్రయత్నాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. పరస్పర ప్రేమ, క్రమశిక్షణ, జాతీయ లక్ష్యం పట్ల అచంచలమైన నిబద్ధతతో దృఢంగా నిలబడిన సమాజం మాత్రమే ఐక్యతను సాధించి, అజేయ శక్తిని పొందుతుందన్నారు.