పూణె : మహారాష్ట్రలోని వాషింలో ఉద్రిక్తత నెలకొంది. దుర్గా నిమజ్జన ఊరేగింపు సందర్భంగా రాళ్ల దాడి ఘటన జరిగింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే.. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే వుందని పోలీసులు ప్రకటించారు.
పోలీసుల కథనం ప్రకారం.. నిమజ్జన సమయంలో గులాల్ చల్లడంపై వ్యక్తుల మధ్య జరిగిన వాగ్వాదం కాస్తా... ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల సకాలంలో జోక్యంతో పరిస్థితి వెంటనే అదుపులోకి వచ్చింది.
అక్టోబర్ 21న రాత్రి సుమారు 8:30 నుండి 9:00 గంటల మధ్య, మాలేగావ్‌లోని టిప్పు సుల్తాన్ చౌక్ వద్దకు దుర్గా విసర్జన ఊరేగింపు చేరుకుంది. అక్కడ కొందరు వ్యక్తుల మధ్య, 'గులాల్' చల్లడం విషయమై వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత, రాళ్ల దాడి జరిగింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి, దుర్గా విసర్జన పూర్తయ్యేలా చూశారు; ప్రస్తుతం ఆ ప్రాంతం ప్రశాంతంగా ఉంది," అని పోలీసులు పేర్కొంటున్నారు.
మరో వైపు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. నిందితులపై చర్యలు తీసుకునేందుకు సీసీ టీవీలను పరిశీలిస్తున్నారు. వీటి ఆధారంగానే చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. మరిన్ని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు. "శాంతిభద్రతలను కాపాడేందుకు స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (SRPF), అల్లర్ల నియంత్రణ విభాగం (RCP) మరియు స్థానిక పోలీసులతో కూడిన బలగాలను మోహరించారు.
వాషిమ్ సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ రామకృష్ణ పవార్ తెలిపిన వివరాల ప్రకారం, ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన ఇళ్ల సమీపంలో ఊరేగింపు వెళ్తున్నప్పుడు, గులాల్ (రంగు పొడి) చల్లడంపై వివాదం తలెత్తింది. కొందరు వ్యక్తులు దీనిని అభ్యంతరపరచడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో, చివరకు ఇరు పక్షాల వారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకునే పరిస్థితి ఏర్పడింది.
source- organiser