న్యూఢిల్లీ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వార్షిక అఖిల భారతీయ కార్యకారిణి మండల్ బైఠక్ ఈసారి ఇండోర్ లోని మాల్వా ప్రాంతంలో జరగనుంది. నవంబర్ 2,3,4 తేదీల్లో ఈ సమావేశాలు జరుగుతాయి.
ఈ సమావేశాలకు ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే, ఆరుగురు సహ సర్ కార్యవాహలు, అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు ఈ బైఠక్ లో పాల్గొంటారు. అలాగే ప్రాంత సంఘచాలకులు, కార్యవాహలు, ప్రాంత ప్రచారకులు, సహ ప్రాంత సంఘచాలకులు, కార్యవాహలు, ప్రచారకులు.. ఇలా 46 ప్రాంతాల నుంచి పాల్గొంటున్నారు. సంఘ్ సంస్థాగత నిర్మాణంలోని మొత్తం 11 క్షేత్రాల నుండి, సంఘచాలక్‌లు, కార్యవాహులు మరియు ప్రచారక్‌లతో పాటు సహ-క్షేత్ర సంఘచాలక్‌లు, కార్యవాహలు, ప్రచారక్‌లు కూడా ఉంటారు.
ఇటీవలే సంఘ కార్య శతాబ్ది ఉత్సవాల ముగింపు, విజయ దశమి ఉత్సవం ముగిసింది. కార్య శతాబ్ది సందర్భంగా దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా కార్యక్రమాలు కూడా ముగిశాయి. విజయ దశమి ఉత్సవం సందర్భంగా సర్ సంఘచాలక్ తన ప్రసంగంలో లేవనెత్తిన కీలక అంశాలపై, తదుపరి కార్యాచరణ గురించి కూడా ఈ బైఠక్ లో చర్చిస్తారు. అలాగే కార్య శతాబ్ది సందర్భంగా నిర్వహించిన అన్ని కార్యక్రమాలపై కూడా సమీక్ష చేయనున్నారు. వీటితో పాటు వివిధ మీడియా మాధ్యమాల్లో వస్తున్న కంటెంట్ పై, మాదక ద్రవ్యాల వినియోగానికి సంబంధించి పెరుగుతున్న ఆందోళనలు, దేశ అంతర్గత వ్యవహారాల్లో బాహ్య శక్తుల జోక్యం, ప్రపంచ పరిస్థితులు వంటి కీలక అంశాలపై కూడా చర్చించనున్నారు.