శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ లో 36 సంవత్సరాల తర్వాత ఓహిందూ ఆలయం తిరిగి తెరుచుకుంది.36 సంవత్సరాలకు పైగా నిర్లక్ష్యానికి గురైన తర్వాత, కుప్వారా జిల్లాలోని గతుంగూ గ్రామంలో ఉన్న మా గోవ్‌షోరి మాతా మందిరాన్ని పునర్నిర్మించారు. ఈ పునర్నిర్మాణం అక్టోబర్ 2026లో పూర్తయింది, దీంతో ఈ చారిత్రక పుణ్యక్షేత్రం పునరుజ్జీవనం పొందింది.
1990ల ప్రారంభంలో అశాంతి మధ్య కాశ్మీరీ హిందువులు లోయను విడిచిపెట్టినప్పుడు, కాశ్మీర్‌లోని అనేక హిందూ మందిరాలు మరియు పుణ్యక్షేత్రాలు ధ్వంసం చేయబడ్డాయి, తగలబెట్టబడ్డాయి. సంవత్సరాలు గడిచేకొద్దీ, అనేక చారిత్రక మందిరాలు పునర్నిర్మించబడ్డాయి లేదా పునరుద్ధరించబడ్డాయి.
మా గోవ్‌షోరి మాతా మందిర పునరుద్ధరణ కాశ్మీరీ హిందూ సమాజానికి ఒక భావోద్వేగ క్షణాలుగా మనం చెప్పుకోచవచ్చు. ఇది హిందువుల అచంచలమైన విశ్వాసాన్ని, తమ మత మరియు సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించుకోవడానికి వారు చేస్తున్న ప్రయత్నాలను ప్రతిబింబిస్తుంది.
ఇంతకుముందు, కాశ్మీర్‌లో దశాబ్దాల అశాంతి మధ్య 36 సంవత్సరాలు మూసివేసిన తర్వాత, శ్రీనగర్‌లోని హబ్బా కడల్ ప్రాంతంలో ఉన్న చారిత్రాత్మక శీతల్‌నాథ్ మందిరాన్ని కూడా తిరిగి తెరిచారు.