కొచ్చి : కేరళంలోని ముస్లిం మెజారిటీ ప్రాంతమైన మలప్పురం జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న ఓ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వళక్కాడ్ పంచాయతీలోని 10వ వార్డులో వున్న అంగన్ వాడీ కేంద్రానికి ‘‘ఖాలిద్ -ఎ- మిల్లత్’’ అని పేరు పెట్టేశారు. నిజానికి ఆ అంగన్వాడీ కేంద్రం పేరు ‘‘కిలిక్కడతయి అంగన్వాడీ’’.
‘ఖాలిద్-ఎ-మిల్లత్’ (Khalid e Millat) అంటే ‘జాతి నాయకుడు’ అని అర్థం. పాకిస్థాన్ మొదటి ప్రధాన మంత్రి లియాఖత్ అలీ ఖాన్ను ‘షహీద్-ఎ-మిల్లత్’ (Shaheed-e-Millat) అని కూడా పిలిచేవారు; దీనికి ‘సముదాయం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు’ అని అర్థం.
అయితే.. అంగన్వాడీ పేరును మార్చేయడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అక్టోబర్ 2025లో, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పంచాయతీకి పాత పేరునే తిరిగి పెట్టాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే, ఏడాది గడిచినా ఆ పేరును ఇంకా మార్చలేదని తెలుస్తోంది.ఇప్పుడు, ఈ పంచాయతీని 'ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్' (IUML) పాలిస్తున్నందు వల్లే ఇలా జరుగుతోందా అనే ప్రశ్న తలెత్తుతోంది.ఈ నేపథ్యంలో, హిందూ ఐక్యవేది ప్రధాన పోషకురాలైన కె.పి. శశికళ టీచర్, సోషల్ మీడియా వేదికగా అధికారులను ఉద్దేశించి, "వాళక్కాడ్ పంచాయతీ పాకిస్థాన్లో ఉందా?" అని ప్రశ్నించారు.
‘‘కేరళలోని ఒక అంగన్వాడీకి ‘ఖాలిద్-ఎ-మిల్లత్’ అని పేరు పెట్టారంటే మీరు నమ్ముతారా? నమ్మాల్సిందే! దీని అసలు పేరు ‘కిలిక్కడతాయీ అంగన్వాడీ’. ఇది మలప్పురం జిల్లాలోని వళక్కాడ్ పంచాయతీలో ఉంది. కొంతకాలం క్రితం ఈ భవనాన్ని పునర్నిర్మించారు. ఆ సమయంలో ‘కిలిక్కడతాయీ అంగన్వాడీ’ పేరును ‘ఖాలిద్-ఎ-మిల్లత్’గా మార్చేశారు’’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, అక్టోబర్ 23, 2025న చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పాత పేరును పునరుద్ధరించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.అయితే, పన్నెండు నెలలు గడిచిపోయినప్పటికీ, ‘ఖాలిద్-ఎ-మిల్లత్’ (Khalid-e-millat) అనే పేరు ఇప్పటికీ ఏమాత్రం మార్పు లేకుండా అలాగే కొనసాగుతోంది.