సంఘాన్ని అర్థం చేసుకోవాలంటే దగ్గరగా చూడాలి: అన్నదానం సుబ్రహ్మణ్యం

VSK Telangana    27-Oct-2026
Total Views |

trsss
 
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌) బర్కత్‌పుర శాఖ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాలు, సంఘ శతాబ్ది వేడుకల్లో భాగంగా నిర్వహించిన పథ సంచలనం, అనంతరం సభ నారాయణగూడలోని కేఎంఐటీ లో జరిగింది.
 
ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రాంత కార్యకారిణి సభ్యులు  అన్నదానం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, “సంఘాన్ని అర్థం చేసుకోవాలంటే సంఘాన్ని దగ్గరగా చూడాలి” అని అన్నారు. సంఘ కార్యకలాపాలను ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా సంఘ లక్ష్యాలు, కార్యపద్ధతి, సమాజం పట్ల సంఘానికి ఉన్న బాధ్యతలను అర్థం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
 
విజయదశమి సందర్భంగా నిర్వహించిన పథ సంచలనంలో స్వయంసేవకులు క్రమశిక్షణతో కదం తొక్కుతూ పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రారంభమైన పథ సంచలనాలు నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి వద్ద కలిశాయి. మార్గమధ్యంలో పలుచోట్ల స్థానికులు స్వాగత వేదికలు ఏర్పాటు చేసి స్వయంసేవకులకు స్వాగతం పలికారు.

trsss2 
అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సంఘ ప్రముఖులు పాల్గొని సంఘ కార్యవిస్తరణ, సామాజిక సమైక్యత, దేశాభివృద్ధిలో పౌరుల పాత్ర వంటి అంశాలపై ప్రసంగించారు. కార్యక్రమంలో స్థానిక సంఘ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
 
కార్యక్రమంలో , విభాగ కార్యవాహ రఘునాథ్, కార్యవాహ  పురుషోత్తం, జిల్లా సహ సంఘచాలక్  కస్తూరి రంగన్, ప్రాంత కార్యకారిణి సభ్యులు  టి.ఎస్.ఆర్. మూర్తి, సహ కార్యవాహలు పరశురాము, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.