
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రచురించిన 'హండ్రెడ్ ఇయర్స్ యంగ్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్' పుస్తకంలో ఇజ్రాయెల్ పరిశోధకుడు యెషయా రోసెన్‌మన్ తన విశ్లేషణను పంచుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో తనకున్న అనుభవాలు భారతీయ సమాజంలోని మూలాలను లోతుగా అర్థం చేసుకోవడానికి దోహదపడ్డాయని ఆయన పేర్కొన్నారు.
భారత్‌లోని ఇజ్రాయెల్ దౌత్య బృందం నిర్వహించిన కార్యక్రమాల్లో పరిచయమైన స్నేహితుల ద్వారా ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులతో తనకు అనుబంధంర్పడిందని రోసెన్‌మన్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఒక ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమంలో తాను పాల్గొన్నానని, పాశ్చాత్య మీడియాలో ఆ సంస్థపై వచ్చే ప్రతికూల కథనాలకు, క్షేత్రస్థాయిలోని వాస్తవాలకు పూర్తి వ్యత్యాసం ఉందని ఆయన వెల్లడించారు. అక్కడి వాతావరణం క్రీడలు, చర్చలు , పాటలతో ఎంతో ఆహ్లాదకరంగా, ఒక కుటుంబ కలయికలా అనిపించిందని స్పష్టం చేశారు.
ప్రతిభకు ప్రాధాన్యం – ప్రధాని మోదీయే నిదర్శనం:
ఆర్‌ఎస్‌ఎస్‌లో స్వార్థ ప్రయోజనాలు లేవని, కార్యకర్తలు నిస్వార్థంతో విధులు నిర్వర్తిస్తున్నారని రోసెన్‌మన్ ప్రశంసించారు. ఆ సంస్థలో కులం, ఆర్థిక స్థితి లేదా కుటుంబ నేపథ్యం కంటే కష్టపడే తత్వానికి మరియు ప్రతిభకే ప్రాధాన్యత లభిస్తుందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయా ఎదుగుదల ఈ ప్రతిభ ఆధారిత వ్యవస్థకు అతిపెద్ద నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ సాధించిన విజయాలు, కృషియే ఆయనను ఈ స్థాయికి చేర్చాయని అభిప్రాయపడ్డారు.
పాశ్చాత్య దేశాల్లో భారతదేశానికి సంబంధించి తాజ్ మహల్, మహాత్మా గాంధీ తర్వాత అత్యంత ప్రాచుర్యం పొందిన పేరు నరేంద్ర మోదీ అని ఆయన తెలిపారు. మోదీ అంతర్జాతీయ గుర్తింపు భారత్ ప్రతిష్టను విదేశాల్లో మరింత పెంచిందన్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, గ్యాస్ కనెక్షన్లు, బ్యాంక్ ఖాతాలు మరియు మౌలిక సదుపాయాల కల్పన వంటి అభివృద్ధి సంక్షేమ పథకాలే ప్రజల్లో ప్రధానికి ఉన్న ఆదరణకు ప్రధాన కారణమని వివరించారు.
తన వ్యాసంలో భారత్ , ఇజ్రాయెల్ సంస్కృతులను పోల్చినట్లు రోసెన్‌మన్ చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్, ఇజ్రాయెల్ , యూదు ప్రపంచం మధ్య పరస్పర సహకారం, సాంస్కృతిక అవగాహన మరింత పెరగాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.
రష్మీ సమంత్ ఎడిటర్‌గా వ్యవహరించిన ఈ పుస్తకంలో 18 మంది యువ నిపుణుల విశ్లేషణలను పొందుపరిచారు. ఆర్‌ఎస్‌ఎస్ కేవలం స్వల్పకాలిక సంస్థ కాదని, దశాబ్దాలుగా 'వ్యక్తి నిర్మాణం' ధ్యేయంగా పనిచేస్తోందని ఈ సందర్భంగా నిర్వాహకులు గుర్తుచేశారు.