
కృతికకు ఇన్స్టాగ్రామ్ ద్వారా కరణ్‌వీర్ సింగ్ సిద్ధూ పరిచయమయ్యాడు. తాను జట్-సిక్కు వర్గానికి చెందిన వ్యక్తిగా ఆమెను నమ్మించాడు. వీరిద్దరూ అక్టోబర్ 2, 2026న లుధియానాలోని ఒక హిందూ ఆలయంలో సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. అయితే, సెప్టెంబర్ 5న అత్తగారింటికి వెళ్లిన తర్వాత అసలు నిజం బయటపడింది. ఆ కుటుంబం సిక్కులు కాదని, క్రైస్తవ మతానికి చెందినవారని బాధితురాలు గుర్తించింది. వారి ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ లో చర్చి ఉందని, మామ పాస్టర్‌గా పనిచేస్తున్నారని తెలిపింది.
హిందూ పద్ధతిలో జరిగిన పెళ్లిని అత్తమామలు అంగీకరించకపోగా, క్రైస్తవ మతంలోకి మారితేనే కోడలిగా ఇంట్లోకి రానిస్తామని షరతు విధించారు. ఇంటి దగ్గర ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో తనను ముంచి మతమార్పిడి చేశారని, ఆపై తెల్లటి బట్టలు కొనుగోలు చేసి క్రైస్తవ పద్ధతిలో మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారని కృతిక వాపోయింది. ఈ దారుణాన్ని ప్రశ్నించిన తన తండ్రిపై అత్తమామలు దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు.
దీంతో పాటు రూ.10 లక్షల అదనపు కట్నం తేవాలని వేధిస్తూ, ఇంట్లో నుండి గెంటివేశారని బాధితురాలు ఆరోపించింది. క్రిస్టియన్ మిషనరీల నుండి ఈ కుటుంబం భారీగా డబ్బులు తీసుకుంటూ ఇలాంటి పనులకు పాల్పడుతోందని ఆమె పేర్కొంది. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుల కుటుంబానికి రక్షణ కల్పించి, దర్యాప్తు వేగవంతం చేసినట్లు హెబోవాల్ పోలీసు స్టేషన్ అధికారులు తెలిపారు.
(Source: Panchjanya.com)