_202610281455556301.jpg)
ఈ వేడుకల ముగింపు సభకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ మంత్రి నంద్ గోపాల్ గుప్తా 'నంది' ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రయాగ్‌రాజ్ మట్టికి ఒక ప్రత్యేకమైన ఆత్మీయత ఉందన్నారు. గంగ, యమున నదులు ప్రయాగ్‌రాజ్‌కు ప్రధాన గుండెకాయ వంటివి అయితే, ఆధ్యాత్మిక, మేధోపరమైన సరస్వతి నది ప్రాముఖ్యత అక్కడ జన్మించిన ప్రతి ఒక్కరి ఆలోచనలు, సంస్కృతిలో సజీవంగా నిలిచి ఉంటుందని పేర్కొన్నారు. భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కృషిని ఆయన కొనియాడారు.
ప్రారంభోత్సవ సభకు అల్హాబాద్ వెస్ట్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రయాగ్‌రాజ్ గొప్పదనాన్ని, సాంస్కృతిక ప్రాముఖ్యతను దేశ రాజధాని ఢిల్లీకి పరిచయం చేసేందుకు శంఖ్ ఇనిషియేటివ్స్ చేసిన ప్రయత్నాన్ని ఆయన అభినందించారు. జెఎన్‌యూ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో ఈ ఉత్సవం నిర్వహించడం ద్వారా యువతరం తమ మూలాలను, సాంస్కృతిక పునాదులను మరచిపోకుండా గర్వపడేలా చేస్తుందని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో ప్రయాగ్ ఉత్సవ్ 2026 పోషకులు, ఈశ్వర్ శరణ్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఆనంద్ శంకర్ సింగ్, శంఖ్ ఇనిషియేటివ్స్ పోషకులు డాక్టర్ కృతికా అగర్వాల్, శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీ విసి ప్రొఫెసర్ మురళీ మనోహర్ పాఠక్ పాల్గొని ప్రయాగ్‌రాజ్ విజ్ఞాన సంప్రదాయం, జ్ఞాన నిర్మాణం గురించి మాట్లాడారు.
ఉత్సవంలో భాగంలో ప్రయాగ్‌రాజ్ సాహిత్య, సాంస్కృతిక ప్రాధాన్యతపై రెండు ప్యానెల్ చర్చలు నిర్వహించారు. డాక్టర్ ధనంజయ్ చోప్రా, డాక్టర్ మృత్యుంజయ్ రావు పర్మార్, ప్రొఫెసర్ మధు రాణి శుక్లా, శాంతను గుప్తా, రౌనక్ గుప్తా, హర్షవర్ధన్ త్రిపాఠి, శివేంద్ర కుమార్ సింగ్, జితేంద్ర మణి త్రిపాఠి తదితరులు ప్రసంగించారు. వీటితో పాటు కథక్ నృత్య ప్రదర్శనలు, జానపద సంగీతం, యువ కవుల సమ్మేళనం ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని అడ్వకేట్ ప్రతీక్ మిశ్రా, ఇంజనీర్ అలోక్ కుమార్ సింగ్, డాక్టర్ సిద్ధాంత్ మిశ్రా, అశుతోష్ ఉపాధ్యాయ్, విజయ్ జైస్వాల్, ప్రొఫెసర్ సప్నా రతన్ షాలతో కూడిన నిర్వహణ బృందం దిగ్విజయం చేసింది.