మసీదు ముందు నుంచి ఆర్‌ఎస్‌ఎస్ ప్రదర్శన వెళ్లడాన్ని నిరసిస్తూ కొందరు తీవ్రవాద భావజాలం ఉన్న వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఈ గొడవకు దిగినట్లు తేలింది. ర్యాలీ సజావుగా సాగుతున్న సమయంలో కొందరు మహిళలు సహా ఒక్కసారిగా గుంపుగా చేరి స్వయంసేవకులపైకి రాళ్లు రువ్వారు. ఈ ఆకస్మిక దాడితో ఆ ప్రాంతంలో తీవ్ర అలజడి, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన పోలీసులపై కూడా దాడి జరగడంతో ఏడుగురు నుండి ఎనిమిది మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు పోలీసులు స్వల్పంగా బలప్రయోగం (లాఠీఛార్జ్) చేసి గుంపును చెదరగొట్టారు. అనంతరం భారీ పోలీసు బందోబస్తు నడుమ పథ సంచలన్‌ను ప్రశాంతంగా ముగించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయగా, పరిస్థితి అదుపులోనే ఉంది. అరెస్ట్ అయిన వారిపై కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.