మణిపూర్ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మణిపూర్ సేవా విభాగం, మణిపూర్ సేవా భారతి కార్యకర్తలు నోంగ్ షుమ్ కాల్పుల ఘటన బాధిత కుటుంబాలకు మానవతా సహాయాన్ని అందించారు. ఈ విషాదకర ఘటనలో, కలప నరికే పనిలో ఉన్న ముగ్గురు కూలీలను కుకీ మిలిటెంట్లు కాల్చి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఆర్‌ఎస్‌ఎస్ మణిపూర్ ప్రాంత్ కార్యవాహ శిజ్‌గురుమాయుమ్ తరుణ్‌కుమార్ శర్మ మరియు సీనియర్ ప్రచారక్ లైశ్రమ్ జాత్రా సింగ్ నేతృత్వంలోని 30 మంది సభ్యుల బృందం బాధితుల కుటుంబాలకు నగదు రూపంలో ఆర్థిక సహాయాన్ని అందజేసింది.
ఈ సందర్శన సమయంలో, కుటుంబ సభ్యులు అంగీకరిస్తే, పన్నెండవ తరగతి వరకు ఉచిత విద్యా సౌకర్యాలను కల్పించేందుకు 'సేవా సమితి మణిపూర్' మరియు 'సేవా భారతి మణిపూర్' బృందాలు ముందుకు వచ్చాయి.మణిపూర్‌లో 2023 మే 3న చెలరేగిన హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, ఆర్‌ఎస్‌ఎస్ మణిపూర్ విభాగం, సేవా భారతి మణిపూర్ మరియు మణిపూర్ సేవా సమితిలతో కలిసి నిరంతరం ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. అలాగే మణిపూర్ లోపల, వెలుపల వున్న వివిధ పాఠశాలల్లో 150 మందికి పైగా విద్యార్థులకు ఉచితంగా వసతి, విద్యను కూడా ఆర్ఎస్ఎస్ సేవా సమితి, సేవా భారతి అందిస్తోంది.
దీనికి అదనంగా, సహాయక శిబిరాలలో నిరాశ్రయులైన విద్యార్థులకు విద్యా కిట్లు, పాఠశాల యూనిఫారాలు, కోచింగ్ తరగతులతో పాటు నిత్యావసర వస్తువులు మరియు వైద్య శిబిరాలను కూడా అందించారు.